పోలీసుల చిత్రహింసలు, యువకుడి ఆత్మహత్య | Young man commits suicide after police torture | Sakshi
Sakshi News home page

పోలీసుల చిత్రహింసలు, యువకుడి ఆత్మహత్య

Published Fri, Feb 24 2017 12:44 AM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

పోలీసుల చిత్రహింసలు, యువకుడి ఆత్మహత్య - Sakshi

పోలీసుల చిత్రహింసలు, యువకుడి ఆత్మహత్య

ములకలపల్లి: పోలీసుల చిత్రహింసలకు తాళలేక ఓ యువకుడు ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన గురు వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ముల కలపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన జంగిలి సాయి(23) రాజుపేటలో ఓ వ్యాపారి వద్ద హమాలీగా పనిచేస్తున్నాడు. ఆ వ్యాపారి ఇంట్లో మంగళవారం రాత్రి రూ.2 లక్షలు చోరీ అయ్యాయి. యజమాని ఫిర్యాదు మేరకు పోలీ సులు అనుమానంతో సాయిని బుధవారం ఉదయం పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి  వదిలిపెట్టారు. అయితే, ఉదయం నుంచి రాత్రి వరకు విపరీతంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారని, చేయని నేరాన్ని తనపై మోపారని సాయి కుటుంబసభ్యులకు చెప్పాడు. గురువారం పోలీసుల నుంచి పిలుపురావడంతో భయపడిన సాయి పురుగులమందు తాగాడు.

 అతడిని బంధువులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి మృతికి పోలీసుల వేధింపులే కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, మంగళవారం రాత్రి చోరీ జరిగితే సాయి మృతి చెందిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. తప్పు లేకుంటే మృతదేహానికి కొత్తగూడెంలో ఎందుకు పోస్ట్‌మార్టం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఎస్సై రామ్‌చరణ్‌ను వివరణ కోరగా సాయిపై అనుమానంతో పిలిపించి విచారణ జరిపి వదిలేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement