
మల్లన్న వాగు ఉధృతిలోనే గర్భిణి మమతను దాటిస్తున్న దృశ్యం
గుండాల: కడుపులో బిడ్డ. పురిటి నొప్పులతో ఇద్దరు గర్భిణుల కష్టాలు. ఆస్పత్రికి వెళదామంటే అడ్డుకుంటున్న వాగు ఉధృతి. అన్నీ భరిసూ్తనే ఇద్దరూ కుటుంబ సభ్యుల సహకారంతో దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై మల్లన్నవాగు వద్దకు తీసుకొచ్చారు.
వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి గర్భిణిని ముగ్గురు కుటుంబ సభ్యులు అతికష్టం వీుద దాటించారు. అక్కడి నుంచి గుండాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భవతి. నెలలు నిండకున్నా ఆమెకు నొప్పులు వస్తుండటంతో అదే వాగుపై నుంచి కుటుంబ సభ్యులు దాటించి ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నూనావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతుండగా భుజాలపై మల్లన్న వాగును దాటించిన ఘటనపై సమగ్ర వివరాలందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment