Gundala
-
తగ్గేదే లేదు.. ఒగ్గేదే లేదు!
‘నీ ప్రయాణంలో కరాటే అనేది వెలిగే కాగడాలా ఉండాలి’ అంటాడు ఒక మార్షల్ ఆర్టిస్ట్. పరిస్థితుల ప్రభావం వల్ల, రకరకాల కారణాల వల్ల దారి ΄పొడుగునా ఆ వెలుగును కాపాడుకోవడం అందరి వల్ల సాధ్యం కాకపోవచ్చు. తండ్రి పక్కనపెట్టిన కాగడా పట్టుకొని కరాటేలో విజయపథంలో దూసుకుపోతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలానికి చెందిన మన్యం బిడ్డ కొండపల్లి చందన.కాస్త సరదాగా చెప్పుకోవాలంటే చందన వాళ్ల ఇంట్లో ‘కరాటే’ అనేది పాత చుట్టంలాంటిది. తండ్రి కొండపల్లి జంపన్నకు కరాటే అంటే ఎంతో ఇష్టం. ఎన్నో కలలు కన్నాడు. బ్లాక్‌బెల్ట్ వరకు వెళ్లాడు. తెల్లవారుజామునే ‘హా’ ‘హూ’ అంటూ తండ్రి సాధన చేస్తుంటే ఆ శబ్దాలు నిద్రలో ఉన్న చందన చెవుల్లో పడేవి. ఆ శబ్దాల సుప్రభాతంతోనే నిద్ర లేచేది. నాన్న సాధన చేస్తుంటే ఆసక్తిగా చూసేది. ఆ తరువాత సరదాగా తాను కూడా సాధన చేసేది. అలా కరాటేతో పరిచయం మొదలైంది.చిన్నప్పటి నుంచే ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న చందనను తల్లిదండ్రులు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయిని సుధకు కరాటేలో ప్రవేశం ఉంది. ఇతర ఆటలతో పాటు కరాటే కూడా విద్యార్థులతో సా«ధన చేయించేది. స్కూలు మొత్తంలో ఓ పదిమంది విద్యార్థినులు కరాటేలో ప్రతిభ చూపిస్తుండటంతో ఆ శిక్షణను కొనసాగిస్తూనే వివిధ పోటీలకు విద్యార్థులను తీసుకువెళ్లేవారు. ఎనిమిదో తరగతి నుంచే కరాటే పోటీలలో పాల్గొంటూ బహుమతులు గెలుస్తూ వచ్చింది చందన.విరామం కాదు ఆరంభ సంకేతంవరంగల్లో జరిగిన జిల్లా స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం గెలుచుకోవడంతో చందన విజయపరంపర మొదలైంది. విశాఖపట్నం, ఖమ్మంలలో జరిగిన పోటీల్లోనూ తన ప్రతిభను చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ముంబై, దిల్లీలో జరిగిన పోటీల్లోనూ పతకాలు సా«ధించింది. అయితే పదోతరగతి తర్వాత ఆటలతోపాటు చదువు ముఖ్యం అంటూ కుటుంబంపై వచ్చిన ఒత్తిడి కారణంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుంచి బయటకు వచ్చి హన్మకొండలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్లో చేరింది. ‘ఇక కరాటే ఆపేసిట్లేనా!’ అడిగే వాళ్లు చాలామంది. అయితే ఆ విరామం మరిన్ని విలువైన విజయాలు సాధించడానికి ఆరంభ సంకేతం అనేది చాలామందితోపాటు చందనకు కూడా తెలియదు.ఇప్పటికీ కలగానే ఉంది!కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న చందనను వదులుకోవడానికి గురుకుల పాఠశాల వారు ఇష్టపడలేదు. ఆమె వేరేచోట చదువుతున్నా తమ స్కూల్ తరఫున పోటీలకు పంపడం ప్రారంభించారు. గత నెల గోవాలో జరిగిన అండర్ 18, వరల్డ్‌కప్ చాంపియన్ షిప్లో చందన పాల్గొంది. తొలిరౌండ్లో కర్ణాటక అమ్మాయిపై గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్రికా, చైనాలకు చెందిన అమ్మాయిలపై విజయం సాధించింది. ‘గోవాకు వెళ్లేప్పటికి నాకు తెలుగు తప్ప మరో భాష రాదు. అక్కడంతా బాగా పాష్‌గా కనిపించడంతో కొంత తడబడ్డాను. ప్రాక్టీస్ కూడా ఎక్కువ చేయలేదు. దీంతో నేషనల్, ఇంటర్నేషనల్ చాంపియన్లతో పోటీపడి నెగ్గగలనా అని సందేహించాను. కర్ణాటక అమ్మాయితో త్వరగానే గేమ్ ముగిసింది. ఆ తర్వాత నాకంటే ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న ఆఫ్రికన్ అమ్మాయితో పోటీ పడ్డాను. ఇక్కడే నా పని అయిపోతుందనుకున్నా. గేమ్నే నమ్ముకుని గెలిచాను. చిన్నప్పటి నుంచి కరాటే అంటే చైనానే గుర్తుకు వస్తుంది. అలాంటిది చివరగా చైనా అమ్మాయిపై విజయం సాధించడం ఇప్పటికీ కలగానే ఉంది’ అంటుంది చందన.గోవా విజయంతో 2025 జనవరిలో మలేషియాలో జరగబోయే పోటీలకు అర్హత సాధించింది. కనే కల విజయాన్ని పరిచయం చేస్తుంది. ఆ విజయం ఎప్పుడూ మనతో చెలిమి చేయాలంటే ఆత్మవిశ్వాసం ఒక్కటే సరిపోదు. లక్ష్యసాధన కోసం బాగా కష్టపడే గుణం కూడా ఉండాలి. కొండపల్లి చందనలో ఆ గుణం కొండంత ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.అదే నా లక్ష్యంనాన్నకు కరాటే అంటేప్రాణం. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆయన కెరీర్ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనకు ఎన్నో కలలు ఉండేవి. స్కూల్లో నేను కరాటే బాగాప్రాక్టీస్ చేస్తున్నానని ఎవరో చెబితే నాన్న ఎంతో సంతోషించారు. దీంతో మరింత ఇష్టం, పట్టుదలతో కరాటే సాధన చేశాను. ‘ఆడపిల్లకు కరాటేలు ఎందుకు! చక్కగా చదివించక’ అంటుండేవారు ఇరుగు ΄పొగురు, బంధువులు. అయితే వారి మాటలతో అమ్మానాన్నలు ప్రభావితం కాలేదు. అమ్మ శారద నా వెన్నంటే నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పతకాలు తేవాలన్నదే నా లక్ష్యం. అయితే ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చులు పెరుగుతున్నాయి. చేయూత అందిస్తే నా ప్రయాణం సులువు అవుతుంది.– చందన– కృష్ణ గోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఫొటోలు : యాసారపు యాకయ్య -
వంద అడుగుల ‘కొండెంగలొద్ది’ పరుగెడుతున్న అగర్‌గూడ, గుండాల జలపాతాలు
► జాలువారే జలపాతాలు పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. దాదాపు వంద అడుగుల ఎత్తునుంచి దూకే జలధార ఇది. పెంచికల్పేట్ నుంచి అగర్‌గూడకు 7 కి.మీ.లు వాహనంలో వెళ్లి, మరో ఐదు కి.మీ.లు నడవాలి. తిర్యాణి మండలం గుండాల గ్రామ పంచాయతీలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. 50 అడుగుల కొండవాలు నుంచి జాలువారుతోంది. తిర్యాణి నుంచి 10 కి.మీ.ల దూరంలో గల రొంపల్లి వరకు వాహనాల్లో వెళ్లొచ్చు. తర్వాత దట్టమైన అడవిలో ఆరు కి.మీ.లు కాలినడకన వెళ్లాలి. -
రాచకొండ కమిషనరేట్లోకి గుండాల ఠాణా
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గుండాల పోలీసుస్టేషన్‌ను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాచకొండ పరిధిలోని 3 డివిజన్లలో ఒకటైన యాదాద్రి డివిజన్లోని భువనగిరి జోన్ కింద ఈ పీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులను రాచకొండకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాల పునర్విభజనకు ముందు గుండాల మండలం నల్లగొండ జిల్లాలో ఉండేది. పునర్విభజన సమయంలో గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో కలిపారు. ఈ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించడంతో గుండాలను యాదాద్రి జిల్లాలో కలిపారు. గుండాల పోలీస్ స్టేషన్‌ను మాత్రం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోనే ఉంచారు. యాదాద్రి–భువనగిరిలోని తుర్కపల్లి, రాజాపేట, ఆలేరు, మోటకొండూర్ పోలీస్ స్టేషన్లు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండగా.. ఒక్క గుండాల మాత్రమే వరంగల్ సీపీ పరిధిలో ఇప్పటివరకు ఉన్నది. (క్లిక్: పోలీసు వెబ్సైట్ ద్వారానే లైసెన్సుల రెన్యువల్) -
సాక్షి ఎఫెక్ట్: ‘కిన్నెరసాని’పై ఇనుప వంతెన ఏర్పాటు
గుండాల: శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కిన్నెరసాని నదిపై తాత్కాలిక ఇనుప వంతెన ఏర్పాటైంది. దీంతో వర్షం వచ్చినప్పుడు నది ఉధృతంగా ప్రవహించినా రాకపోకలు సులభతరం కానున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మొదుగులగూడెం–నడిమిగూడెం గ్రామాల నడుమ నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తికాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వర్షాలతో నదీ వ్రాహం పెరగగా, గిరిజనులు కట్టెలతో నిచ్చెన మాదిరి ఏర్పాటుచేసుకుని దాటిన విషయమై ‘సాక్షి’లో మంగళవారం ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో ఎస్పీ సునీల్‌దత్ ఆదేశాలతో గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్సై ముత్యం రమేశ్ సిబ్బందితో కలసి బుధవారం ఇనుప పైపులు, స్లాబ్ రేకులతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేయించారు. చదవండి: ‘ఈ సాహసం ప్రమాదకరమై‘నది’ -
దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది
గుండాల: కడుపులో బిడ్డ. పురిటి నొప్పులతో ఇద్దరు గర్భిణుల కష్టాలు. ఆస్పత్రికి వెళదామంటే అడ్డుకుంటున్న వాగు ఉధృతి. అన్నీ భరిసూ్తనే ఇద్దరూ కుటుంబ సభ్యుల సహకారంతో దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై మల్లన్నవాగు వద్దకు తీసుకొచ్చారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి గర్భిణిని ముగ్గురు కుటుంబ సభ్యులు అతికష్టం వీుద దాటించారు. అక్కడి నుంచి గుండాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భవతి. నెలలు నిండకున్నా ఆమెకు నొప్పులు వస్తుండటంతో అదే వాగుపై నుంచి కుటుంబ సభ్యులు దాటించి ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నూనావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతుండగా భుజాలపై మల్లన్న వాగును దాటించిన ఘటనపై సమగ్ర వివరాలందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు. -
గర్భిణి మహిళ కష్టం
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. (చదవండి : పెట్రోల్ పోసి.. నిప్పంటించి..) నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. (చదవండి : మూడు రోజులు విధుల బహిష్కరణ ) -
గుండాల ఎన్కౌంటర్ : విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : గుండాల ఎన్కౌంటర్లో మృతి చెందిన న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి చెందిన నాయకుడు లింగన్న రీపోస్టుమార్టం పూర్తయిందని, అయితే నివేదిక వెల్లడించడానికి కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను ఈ నెల 7న సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లింగన్న మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో లింగన్నను హతమార్చారంటూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది. -
గుండాల ఎన్కౌంటర్ : హైకోర్టు కీలక ఆదేశాలు..!
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్ నేత ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్ రీజినల్ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్ పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్ల గూడెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు. ఈఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. (చదవండి : అభయారణ్యంలో ఎన్కౌంటర్) విచారణ చేపట్టిన హైకోర్టు లింగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్కవర్లో సమర్పించాలని మెడికల్ బోర్డు సీనియర్ అధికారులకు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఎన్కౌంటర్ చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలి సాక్షి, హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇది ఎన్కౌంటర్ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్కౌంటర్ తర్వాత ఆరు పోలీస్స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు. -
అభయారణ్యంలో ఎన్కౌంటర్
సాక్షి, కొత్తగూడెం: భద్రాద్రి–కొత్తగూడెం జిల్లాలో కీలక నక్సల్ నేత ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఉలిక్కిపడింది. సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ (రాయల వర్గం) ఖమ్మం, వరంగల్ రీజినల్ కార్యదర్శి, ఆపార్టీ అజ్ఞాత దళాల కమాండర్ పూనెం లింగన్న అలియాస్ శ్రీధర్ హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున గుండాల మండలంలోని రోళ్లగడ్డ–దేవళ్లగూ డెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో పందిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో లింగన్న మృతి చెందగా, మరో ఆరుగురు తప్పించుకున్నారు. లింగన్నతోపాటు ఏరియా కమాండర్ గోపి, మరో ఐదుగురు దళ సభ్యులు 3 రోజులుగా అక్కడ మకాం వేశారు. పోలీసు బలగాలు కొన్ని రోజులుగా అదేప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. లింగన్న దళం అక్కడ ఉన్న ట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆ ప్రాం తానికి చేరుకున్నారు. దీంతో పోలీసులకు, లింగన్న దళానికి మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. లింగన్న మృతిచెందాడు. ఏరియా కమాండర్ గోపి, మరో ముగ్గురు దళసభ్యులు పారిపోయారు. మరో ఇద్దరు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై రాళ్లదాడి ఉదయం 7 గంటల సమయంలో లింగన్న ఎన్కౌంటర్ జరగ్గా..మధ్యాహ్నం వరకు పూర్తిస్థాయిలో సమాచారం బయటకు రాకపోగా.. సంఘటన స్థలానికి ప్రజలను, మీడియాను పోలీసులు వెళ్లనివ్వలేదు. లింగన్న సొంతూరు రోళ్లగడ్డ కావడంతో ఆ ప్రాం తంలో తీవ్ర అలజడి నెలకొంది. గుండాల మండలంలోని రోళ్లగడ్డ, లింగగూడెం, దేవళ్లగూడెం, పోలిరెడ్డిగూడెం తదితర గ్రామాలకు చెందినవారు అటవీ ప్రాంతం వద్దకు చేరుకున్నారు. సంఘటనాస్థలంలో వంట సామగ్రి తప్ప ఏమీ కనిపించలేదు. తమ అదుపులో ఉన్న మరో ఇద్దరు దళసభ్యులతో లింగన్న మృతదేహాన్ని మోయిస్తూ.. మరో మార్గం గుండా పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన ప్రజలు ఆగ్రహంతో రాళ్ల దాడి చేయగా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు తప్పించుకునేక్రమంలో లింగన్న మృతదేహాన్ని, అదుపులోకి తీసుకున్న ఇద్దరు దళ సభ్యులను వదిలి వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు దళసభ్యులు గ్రామస్తుల్లో కలిసిపోయి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన పోలీసులు ఆరు, ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు మీడియా ప్రతినిధులపై సైతం పోలీసులు చేయిచేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గుండాలకు రాకుండా వేరే మార్గంలో లింగన్న మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు పందిగుట్ట పక్కన గుట్టపై న్యూడెమోక్రసీ లింగన్న దళాలకు సంబంధించి మరో రెండు మృతదేహాలు ఉన్న ట్లు సమాచారం. ఈ మేరకు స్థానిక పోలీసులు న్యూడెమోక్రసీ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 20 నెలల తర్వాత ఇల్లెందు ఏజెన్సీలో.. ఇల్లెందు డివిజన్ పరిధిలోని ఏజెన్సీలో 20 నెలల తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. 2017, డిసెంబర్ 14న టేకులపల్లి మండలంలోని చింతోనిచెలక–మేళ్లమడుగు అటవీప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 9 మంది సీపీబాట (చండ్ర పుల్లారెడ్డి బాట) దళసభ్యులు మృతిచెం దారు. కాగా, ఉద్యమంలో 20ఏళ్లకు పైగా ప్రస్థా నం కలిగిన, అజ్ఞాతదళాలకు కమాండర్‌గా ఉన్న లింగన్న మృతితో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీలో ఆందో ళన నెలకొంది. ఆపార్టీ కీలకనేత ఆవునూరి మధు బుధవారం వరంగల్ జైలు నుంచి విడుదల కాగా.. కొన్ని గంటల ముందే లింగన్న ఎన్కౌంటర్ కావడంతో నేతలు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలం జైలులో ఉండి వచ్చారు. తిరిగి గత ఏప్రిల్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే అజ్ఞాతంలోకి వెళ్లారు. లింగన్నను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు ఏకపక్షంగా చంపేశారని ఎన్డీ నేత, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రీజియన్ కార్యదర్శి ఆవునూరి మధు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టారు. ఎన్కౌంటర్లతో ఉద్యమాలను ఆపలేరు లింగన్న ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా గిరిజన హక్కుల కోసం పోరాడుతూ వారికి అండగా నిలబడుతున్న కమాండర్ లింగన్నను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు జరిపి హత్య చేశారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారించాలి సాక్షి, హైదరాబాద్: సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు లింగన్నను పోలీసులు కాల్చి చంపడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వివిధ వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఇది ఎన్కౌంటర్ కాదని, పోలీసులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం అన్నారు. బూటకపు ఎన్కౌంటర్ తర్వాత ఆరు పోలీస్స్టేషన్లలో ప్రజలను నిర్బంధించారని న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు తెలిపారు. పోడు భూముల కోసం ఉద్యమించిన నేతను చంపడ మంటే ప్రజలపై యుద్ధం చేయడమే అని అన్నారు. -
ఉద్రిక్తంగా గుండాల అటవీ ప్రాంతం
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ దళ సభ్యుడు మరణించగా.. ఏడుగురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో దళ సభ్యుడు గాయపడి వరంగల్ వైపు వస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో వరంగల్ జిల్లా పోలీసులు అప్రమత్తమై వర్ధన్నపేట పట్టణం, వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారి పై విస్తృతంగా వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా అటవీ ప్రాంతంలో తిరుగుతున్న వీరు పోలీసులకు కనిపించిన సమయంలో ఇరువర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేవలగూడెం అటవీ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. లింగన్న దళానికి చెందిన ఏడుగురు సభ్యులను పోలీసుల అదుపులోకి తీసున్నారని వారికి ఎటువంటి హాని తలపెట్టవద్దని న్యూడెమోక్రసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లందు పట్టణంలో ధర్నా చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పోలీసులను చుట్టుముట్టారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దళాలకు, పోలీసుల మధ్య కాల్పుల చోటుచేసుకోవడంతో గుండాల అటవీ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. -
తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న గుండాల
సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దేవలగూడెం అడవుల్లో లింగన్న దళానికి, పోలీసులకు మధ్య ఉదయం నుండి భారీ ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్నతో సహా, ఓ దళ సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసులు నిర్థారించాల్సి ఉంది. గత కొంత కాలంగా దేవలగూడెం అటవీ ప్రాంతంలో లింగన్న దళం సంచరిస్తోందన్న సమాచారం పోలీసులు అందింది. దీంతో బుధవారం ఉదయం నుంచి అజ్ఞాత దళాన్ని టార్గెట్‌గా చేసుకుని పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో తుపాకుల మోతతో దేవలగూడెం,గుండాల అటవీప్రాంతం దద్దరిల్లుతోంది. అయితే కాల్పులకు వ్యతిరేకంగా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఏకపక్షంగా జరుపుతున్న కాల్పులను నిలిపివేయాలంటూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. -
ఇద్దరు ప్రధానోపాధ్యాయుల సస్పెన్షన్
గుండాల: మండలంలోని రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై ఐటీడీఏ పీఓ పమెల సత్పథి సస్పెన్షన్ వేటు వేశారు. మరో హెచ్ఎంతో పాటు ఒక ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. గురువారం ఆమె ఆశ్రమ పాఠశాలలను తనిఖీ చేసి బోధన తీరును పరిశీలించారు. తొలుత కాచనపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యాబోధనను పరిశీలించారు. పాఠశాల హెచ్ఎం లక్ష్మి, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడిందని గుర్తించారు. చేయూత పథకం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని, డైరీ రాయించడం లేదని, చదివించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లిష్‌లో విద్యార్థులు పూర్తిగా వెనుకబడి ఉంటున్నారని అన్నారు. శంభూనిగూడెం పాఠశాలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ రెండు పాఠశాలల హెచ్ఎంలు లక్ష్మి, వసంతపై సస్పెన్షన్ వేటు విధించారు. శంభునిగూడెం పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మామకన్ను బాలుర ఆశ్రమ పాఠశాలలోనూ పరిస్థితి బాగా లేదని తెలుసుకుని అక్కడి హెచ్ఎం నరేందర్‌కు కూడా షోకాజ్ నోటీసు అందించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
టీఆర్ఎస్లో వర్గ పోరాటం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరాటం భగ్గుమంది. గుండాల మండలం టీఆర్ఎస్లో నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో గుండాల టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఖదీర్‌పై మండల అధ్యక్షుడు భాస్కర్ శనివారం దాడిచేశాడు. ఖదీర్‌పై భాస్కర్ కర్రలతో దాడిచేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఖదీర్ గుండాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
సర్పంచ్ అంటే ఇలా‘గుండాల’
చేవెళ్ల : బదిలీల ఆర్భాటంలో ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఇంటి దారి పడుతున్నారు. దీంతో గ్రామ సర్పంచే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇది చేవెళ్ల మండలంలోని గుండాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. వివరాలోకి వెళ్తే... మండలంలోని గుండాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు మల్లమ్మ మాత్రమే ఉంది. గతేడాది ఒక ఉపాధ్యాయురాలు, విద్యావలంటీర్లతోనే పాఠశాలను కొనసాగించారు. ఈఏడాది ఇంకా విద్యావలంటీర్ల నియామకం జరగలేదు. దీంతో ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయురాలు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆమె కూడా రెండురోజులుగా పాఠశాలకు రావటం లేదు. అయితే ఇదే పాఠశాలలో గ్రామానికి చెందిన సర్పంచ్ పుష్పకుమారిగణేశ్ ఇద్దరు పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో రోజూ ఉదయం సర్పంచే స్వయంగా తమ ఇద్దరి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చి వదిలి వెళ్తోంది. ఈ సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయురాలు లేకపోవటంతో సర్పంచ్ పుష్పకుమారి విద్యార్థులకు టీచర్‌గా మారి పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాల పరిస్థితిని పట్టించుకోరా అంటూ ఆమె ప్రశ్నించారు. మా పిల్లలు ఈ బడిలోనే ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలిసింది. లేదంటే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చేదని అధికారుల తీరుపై ఆమె మండిపడుతున్నారు. గుండాలకు కేటాయించిన ఉపాధ్యాయురాలు రాకపోవటంతో పాఠశాల ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలలు ఎలా నడవాలని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో సర్దుబాటు చేస్తాం గుండాల ప్రాథమిక పాఠశాలకు మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో ఉన్న ఉపాధ్యాయురాలు బదిలీ కావటంతో కొత్తగా ఒక ఉపాధ్యాయురాలిని కేటాయించారు. అయితే అమె గుండాల దూరం అవుతుందని రాకపోవటంతో ఎవరూ లేక ఖాళీ అయ్యింది. విద్యావలంటీర్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. వీవీలను కేటాయిస్తాం. అప్పటి వరకు హైస్కూల్ నుంచి ఒక టీచర్‌ను ప్రాథమిక పాఠశాలకు కేటాయించి కొనసాగిస్తాం. రెండు మూడు రోజుల్లో అయితే మండలానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులతో ఎక్కువగా ఎక్కడైనా ఉంటే వారిని సర్దుబాటు చేయటానికి వీలవుతుంది. - ఎంఈఓ సుజాత -
మేడారానికి పగిడిద్దరాజు
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గుండాల మండలం యాపలగడ్డ నుంచి పగిడిద్దరాజును తోడ్కొని అరెం వంశీయులు సోమవారం బయలుదేరారు. కాలినడకన పడగ (జెండా)లతో జాతర ప్రారంభానికి(ఈ నెల 31కి) ముందే వారు మేడారం చేరుకుంటారు. గుండాల: గుండాల మండలం యాపలగడ్డ గ్రామం నుంచి సోమవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు పగిదిద్దరాజు బయల్దేరాడు. కాలినడక ఆయన(అరెం) వంశీయులు పడగలలో పయనమయ్యారు. రెండేళ్లకోసారి భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో జరిగే మేడారం జాతరకు సమ్మక్క భర్త పగిడిద్దరాజును యాపలగడ్డ గ్రామస్తులే తీసుకెళ్తారు. ఈ క్రమంలో సోమవారం అరెం వంశీయులు పగిడిద్దరాజు గర్భగుడి వద్ద పడగలకు( జెండాలకు), శివసత్తులకు పురాతన కాలంనాటి ఆభరణాలకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక పగిడిద్దరాజు గద్దెల వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. పడగలను, నగలు, గజ్జెలు ధరంచిన వడ్డెలు భుజాన పెట్టుకుని ఊరేగింపుతో పయననమయ్యారు. గ్రామ గ్రామం మీదుగా గిరిజన నృత్యాలతో, డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించుకుంటూ తీసుకెళ్లారు. యాపలగడ్డ గ్రామ ప్రజలంతా చిన్నా,పెద్దా తేడా లేకుండా డ్యాన్సులు వేశారు. పగిడిద్ద రాజు పూజలను, ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా పూనుగొండ్ల పెనకం వంశీయులు లక్ష్మిపురం గ్రామం వద్ద వీరిని కలుసుకుంటారు. రెండు రోజుల పాటు పాదయాత్ర చేసి జాతర ముందురోజు జంపన్న వాగులో బస చేస్తారు. బుధవారం రోజు పగిడిద్దరాజుతో పాటు, కొండాయిగూడెం నుంచి గోవిందరాజును, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామాల పూజారులు తీసుకువస్తారు. ఆ ముగ్గురు వన దేవతలకు మేడారంలోని గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం నాటికి సమ్మక్క (దేవత)ను చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువస్తారు. అదేరోజు రాత్రి పగిడిద్దరాజు–సమ్మక్కల దేవతలకు నాగవెళ్లి(పెళ్లి) చేస్తారు. దీంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్కను శనివారం వనానికి తీసుకెళ్లగా జాతర ముగుస్తుంది. తిరిగి అరెం వంశీయలు పగిడిద్ద రాజును పాదయాత్రతో గుండాలకు చేర్చుతారు. అనంతరం ప్రతీ ఏటా యాపలగడ్డలో పగిడిద్ద రాజు–సమ్మక్కల నాగవెళ్లి జాతరను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామని అరెం వంశీయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తుమ్మ గోపి, ఎస్సై శ్రావన్ కుమార్, వడ్డెలు, పూజారులు అర్రెం అప్పయ్య, బుచ్చయ్య, లక్ష్మినర్సు, చిన్న కాంతారావు, సత్యం, జోగయ్య, ఇద్దయ్య, పెద్ద కాంతారావు, నాగేశ్వరావు, సమ్మయ్య, ముత్తయ్య, భిక్షం రమేష్,నాగేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
నూతన జిల్లాల పేరుతో మోసం
గుండాల : ప్రజా సమస్యలను పక్కనబెట్టి నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయం మేరకు నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తూనే అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతుందన్నారు. భువనగిరితో 70 సంవత్సరాల శాస్త్రీయ సంప్రదాయ సంబంధాలు కలిగిన గుండాల మండలాన్ని ఆలేరు నియోజకర్గం నుంచి జనగామలో కలపడం సిగ్గుచేటని విమర్శించారు. గుండాల మండలంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యుల నుంచి మొదలు కొని ఎంపీపీ, జెడ్పీటీసీల వరకు రాజీనామా చేసి ఆమోదింపజేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం కలిగి గుండాల మండలాన్ని యాదాద్రిలో కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులచే రాజీనామాలు చేయించి ఆమోదింప చేయించుకునే బాధ్యత తమదేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అ«ధ్యక్షుడు బబ్బూరి సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ దుంపల శ్రీనువాస్, తుర్కలషాపురం సర్పంచ్ పురుగుల మల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు బూడిద రాములు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజరత్నం, నాయకులు బండారు వెంకటేష్, బిక్షం, తదితరులు ఉన్నారు. -
వస్తాకొండూర్ చెరువు అలుగులో చిక్కిన యువకులు
వస్తాకొండూర్ (గుండాల) చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు యువకులువస్తాకొండూర్ చెరువు అలుగులో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని పెద్దపడిశాలకి చెందిన ఆకుల మహేష్, పొన్నగాని మహేష్, దండు నరేష్, గోలి కృష్ణ అనే నలుగురు యువకులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో చేపలు పట్టడానికి వస్తాకొండూర్ చెరువు అలుగులోకి వెళ్లారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా అలుగు ఉధృతి పెరుగుతుండటంతో తిరిగి రావడానికి ప్రయత్నించారు. వరద నీటిని దాటడానికి వీలు లేక అలుగులో ఉన్న పెద్ద బండరాయిపై 18 గంటలు ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు గ్రామస్థుల సహకారంతో చెరువు వద్దకు వెళ్లి ఉప్పుల వెంకన్న, ఉప్పుల మహేష్ సాహసించి తాడు సహాయంతో రాయిమీద ఉన్న వారిని ఒడ్డుకు చేర్చారు. స్థానిక ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను కాపాడిన వెంకన్న, మల్లేష్లకు శాలువాలు కప్పడంతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి అభినందించారు. -
సమస్యలు పరిష్కరించాలి
గుండాల : మాదిగ రిజర్వేషన్ల పోరాటం కోసం చేపట్టిన పాదయాత్ర ఫలితంగా సమస్యలు పరిష్కారం కాకుంటే నవంబర్ 18 తరువాత ప్రభుత్వంపై ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని చేపట్టిన మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం గుండాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ హామీ ఇచ్చినప్పటికీ మాదిగల వర్గీకరణ సమస్య నెరవేర్చక పోవడం వల్ల పాదయాత్ర చేపట్టామన్నారు. నవంబర్ 18లోగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టివ్వడంతో పాటు డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వకపోతే ప్రభుత్వంపై చావు డప్పుతో ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మాదిగల సమస్యల పరిష్కారం కోసం మాదిగలంతా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు నత్తి కృష్ణ మాదిగ, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాపాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, మాదిగ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిలుకమారి గణేష్ మాదిగ, నాయకులు శ్రీను, కిష్టయ్య, నర్సయ్య, శంకర్, దశరథ, కొండల్రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
దొంగతనం కేసులో ఐదుగురి రిమాండ్
గుండాల : మండల పరిధిలోని టి.శాపురం, వెల్మజాల మధిర బూర్జుబావి గ్రామాల్లో ఇటీవల జరిగిన గొర్రెల దొంగతనం కేసులో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుండాల మండల పరిధిలోని టి.శాపురంలో ఆగస్టు 5వ తేదీ రాత్రి 24 గొర్రెలు, ఆగస్టు 23వ తేదీ వెల్మజాల మధిర బూర్జుబావి గ్రామంలో 37 గొర్రెలు అపహరణకు గురయ్యాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సోమవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం విషయం బట్టబయలైందన్నారు. వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం పెద్దమడూరు మండలానికి చెందిన బానావత్ బోజానాయక్, బానావత్ రమేష్, దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి బానారి వెంకన్న, గుండాల మండలం వెల్మజాల మధిర గ్రామం బూర్జుబావికి చెందిన వల్లాల మహేందర్, తోటకూరి యాదయ్యలు దొంగతనానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.1.91 లక్షలు రికవరీ చేసి నిందితులను భువనగిరి కోర్టు మెజిస్ట్రేట్ వద్ద సోమవారం రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మైసయ్య, రమేష్, అజిత్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, నాగయ్య, రామచంద్రు, బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఇంటర్నెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గుండాల : గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కోరారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్వీ నాయకులు అన్నెపర్తి భిక్షం ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ కేంద్రాన్ని బుధవారం ప్రారంభించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్నెట్ ద్వారా బ్యాంకు లావాదేవిలతో పాటు పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. మారుమూల ప్రాంతంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్న నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చిందం ప్రకాశ్, జేఏసీ చైర్మన్ జి. సోమిరెడ్డి మాజీ ఎంపీపీ హరితాదేవి, నాయకులు యాదగిరి, దశరథ, శ్రీనువాస్, రమేష్, తదితరులు ఉన్నారు. -
‘మహా’ ఒప్పందం చరిత్రాత్మకం
గుండాల : మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న జల ఒప్పందం చరిత్రాత్మకంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమైక్యాంధ్ర నాయకులు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. 40 సంవత్సరాలుగా వేల టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలుస్తున్నప్పటికీ తెలంగాణకు చుక్క నీరు ఇవ్వని అసమర్థులు కాంగ్రెస్ వారు అని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేసీఆర్ కుదుర్చుకున్న 3 బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారని, అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్కలు లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కానుందని కాలేశ్వరం ప్రాజెక్టుతో గంధమల్ల , బస్వాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు భువనగిరి నియోజకవర్గాలు సస్యశ్యామలం కానున్నట్లు ఆమె తెలిపారు. కొత్త ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేసి సాగు నీరు అందిస్తామన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిందం ప్రకాశ్, జెడ్పీటీసీ సభ్యుడు మందడి రామకృష్ణారెడ్డి, జేఏసీ చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ రావుల హరితాదేవి, కో–ఆఫ్షన్ మెంబర్ ఎండీ షర్పోద్దీన్, నాయకులు మూగల శ్రీనువాస్, ఇమ్మడి దశరథ, లగ్గాని రమేష్, తదితరులు ఉన్నారు. -
రక్తదానం ప్రాణదానంతో సమానం
గుండాల : రక్తదాన శిబిరాల్లో మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవం పోస్తుందని పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం మండల టీఆర్ఎస్ పార్టీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు, ప్రభుత్వ విప్ సునీత 46వ జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్తదానంపై అపోహలను వదిలి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రకాష్, ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, కాలె మల్లేషం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోత్కూరు శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా డైరక్టర్ ఇమ్మడి దశరథ, షర్ఫోద్ధిన్, మల్లయ్య, మాధవి, అనసూర్య, శ్రీనివాస్, రమేష్, పాండరి, రమేష్‌రెడ్డి, ఉప్పలయ్య, భిక్షం పాల్గొన్నారు. -
ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలి– మంత్రి జగదీశ్‌రెడ్డి
అనంతారం (గుండాల) : బంగారు తెలంగాణగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా ఆదివారం మండలంలోని అనంతారం, సుద్దాల గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కృష్ణారావుతో కలిసి మొక్కలు నాటిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత ప్రజలు కీలకంగా పని చేశారని, అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ద్వారా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు తాగు నీరు అందించి సస్యశ్యామలం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మండలంలోని అనంతారం గ్రామంలో రూ.5 లక్షలతో మంజూరైన యువజన సంఘం భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులకు, సుద్దాలలో రూ.4.75 కోట్లతో మంజూరైన సుద్దాల, పల్లెపహాడ్ గ్రామాల మధ్య ఉన్న బిక్కేరుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌లు ఆదివారం శంకుస్థాపన చేశారు. మండలానికి వరాల జల్లు గుండాల మండలం తుర్కలశాపురం జీడికల్ చౌరస్తా మిగిలిన మెటల్ పనులను బీటీగా మార్చేందుకు రూ.25 లక్షలు, అనంతారం నుంచి తేర్యాలలో మిగులు రోడ్డు పనిని బీటీగా మార్చేందుకు రూ.2 కోట్లు, 20 విద్యుత్ స్తంభాలను మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి వరాలు గుప్పించారు. సుద్దాలలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.5 లక్షలు, యూత్ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, పల్లెపహాడ్‌లో సీసీ రోడ్డు నిర్మాణం పనులకు రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి సభా ముఖంగా ప్రకటించారు.