సమస్యలు పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలి
Published Tue, Sep 20 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM
గుండాల : మాదిగ రిజర్వేషన్ల పోరాటం కోసం చేపట్టిన పాదయాత్ర ఫలితంగా సమస్యలు పరిష్కారం కాకుంటే నవంబర్ 18 తరువాత ప్రభుత్వంపై ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని చేపట్టిన మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం గుండాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ హామీ ఇచ్చినప్పటికీ మాదిగల వర్గీకరణ సమస్య నెరవేర్చక పోవడం వల్ల పాదయాత్ర చేపట్టామన్నారు. నవంబర్ 18లోగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టివ్వడంతో పాటు డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వకపోతే ప్రభుత్వంపై చావు డప్పుతో ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మాదిగల సమస్యల పరిష్కారం కోసం మాదిగలంతా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు నత్తి కృష్ణ మాదిగ, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాపాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, మాదిగ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిలుకమారి గణేష్ మాదిగ, నాయకులు శ్రీను, కిష్టయ్య, నర్సయ్య, శంకర్, దశరథ, కొండల్‌రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Advertisement