భద్రాచలం మండలం గుండాల కాలనీలో విష జర్వాలు ప్రబలాయి. దీంతో కాలనీకి చెందిన ఓ వ్యక్తి విషజర్వంతో మృతి చెందాడు.
ఖమ్మం: భద్రాచలం మండలం గుండాల కాలనీలో విష జర్వాలు ప్రబలాయి. దీంతో కాలనీకి చెందిన ఓ వ్యక్తి విషజర్వంతో మృతి చెందాడు. మరో 30 మంది వ్యక్తులు ఈ విషజర్వాల భారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందుబాటులో లేనట్లుగా సమాచారం.
ఇటీవల కురిసిన వర్షాలకు పారశుధ్యం అధ్వానంగా తయారైందని, దోమలు వ్యాప్తి చెంది ప్రజానీకం వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య పనులపై వెంటనే దృష్టి సారించాలని, ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు.