వస్తాకొండూర్ చెరువు అలుగులో చిక్కిన యువకులు
వస్తాకొండూర్ చెరువు అలుగులో చిక్కిన యువకులు
Published Sat, Sep 24 2016 12:31 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
వస్తాకొండూర్ (గుండాల)
చేపలు పట్టడానికి వెళ్లిన నలుగురు యువకులువస్తాకొండూర్ చెరువు అలుగులో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని పెద్దపడిశాలకి చెందిన ఆకుల మహేష్, పొన్నగాని మహేష్, దండు నరేష్, గోలి కృష్ణ అనే నలుగురు యువకులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో చేపలు పట్టడానికి వస్తాకొండూర్ చెరువు అలుగులోకి వెళ్లారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా అలుగు ఉధృతి పెరుగుతుండటంతో తిరిగి రావడానికి ప్రయత్నించారు. వరద నీటిని దాటడానికి వీలు లేక అలుగులో ఉన్న పెద్ద బండరాయిపై 18 గంటలు ఉండిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు గ్రామస్థుల సహకారంతో చెరువు వద్దకు వెళ్లి ఉప్పుల వెంకన్న, ఉప్పుల మహేష్ సాహసించి తాడు సహాయంతో రాయిమీద ఉన్న వారిని ఒడ్డుకు చేర్చారు. స్థానిక ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని యువకులను కాపాడిన వెంకన్న, మల్లేష్‌లకు శాలువాలు కప్పడంతో పాటు నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి అభినందించారు.
Advertisement