రక్తదానం ప్రాణదానంతో సమానం
రక్తదానం ప్రాణదానంతో సమానం
Published Wed, Aug 17 2016 1:25 AM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
గుండాల : రక్తదాన శిబిరాల్లో మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు జీవం పోస్తుందని పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం మండల టీఆర్‌ఎస్ పార్టీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వారు, ప్రభుత్వ విప్ సునీత 46వ జన్మ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్తదానంపై అపోహలను వదిలి ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రకాష్, ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, కాలె మల్లేషం, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోత్కూరు శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, పశు గణాభివృద్ధి సంస్థ జిల్లా డైరక్టర్ ఇమ్మడి దశరథ, షర్ఫోద్ధిన్, మల్లయ్య, మాధవి, అనసూర్య, శ్రీనివాస్, రమేష్, పాండరి, రమేష్‌రెడ్డి, ఉప్పలయ్య, భిక్షం పాల్గొన్నారు.
Advertisement
Advertisement