సాక్షి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. దేవలగూడెం అడవుల్లో లింగన్న దళానికి, పోలీసులకు మధ్య ఉదయం నుండి భారీ ఎత్తున ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దళ కమాండర్ లింగన్నతో సహా, ఓ దళ సభ్యుడు మరణించినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసులు నిర్థారించాల్సి ఉంది.
గత కొంత కాలంగా దేవలగూడెం అటవీ ప్రాంతంలో లింగన్న దళం సంచరిస్తోందన్న సమాచారం పోలీసులు అందింది. దీంతో బుధవారం ఉదయం నుంచి అజ్ఞాత దళాన్ని టార్గెట్‌గా చేసుకుని పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో తుపాకుల మోతతో దేవలగూడెం,గుండాల అటవీప్రాంతం దద్దరిల్లుతోంది. అయితే కాల్పులకు వ్యతిరేకంగా ఇల్లందు పట్టణంలో న్యూడెమోక్రసి నేతలు ర్యాలీ నిర్వహించారు. ఏకపక్షంగా జరుపుతున్న కాల్పులను నిలిపివేయాలంటూ ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment