సాక్షి, హైదరాబాద్ : గుండాల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి చెందిన నాయకుడు లింగన్న రీపోస్టుమార్టం పూర్తయిందని, అయితే నివేదిక వెల్లడించడానికి కొంత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం పోస్టుమార్టం నివేదికను ఈ నెల 7న సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాగా గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో పోలీసులకు, న్యూడెమోక్రసీ అజ్ఞాత దళానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో లింగన్న మృతిచెందడం ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో లింగన్నను హతమార్చారంటూ ఆదివాసీ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment