నూతన జిల్లాల పేరుతో మోసం | cheating by the name of new dist | Sakshi
Sakshi News home page

నూతన జిల్లాల పేరుతో మోసం

Published Thu, Oct 6 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM

నూతన జిల్లాల పేరుతో మోసం

గుండాల : ప్రజా సమస్యలను పక్కనబెట్టి నూతన జిల్లాల ఏర్పాటు పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్‌ ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ వసతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రజాభిప్రాయం మేరకు నూతన జిల్లాలు, నూతన మండలాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేస్తూనే అశాస్త్రీయంగా, అస్తవ్యస్తంగా నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతుందన్నారు. భువనగిరితో 70 సంవత్సరాల శాస్త్రీయ సంప్రదాయ సంబంధాలు కలిగిన గుండాల మండలాన్ని ఆలేరు నియోజకర్గం నుంచి జనగామలో కలపడం సిగ్గుచేటని విమర్శించారు. గుండాల మండలంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యుల నుంచి మొదలు కొని ఎంపీపీ, జెడ్పీటీసీల వరకు రాజీనామా చేసి ఆమోదింపజేసుకుంటేనే ప్రభుత్వంలో చలనం కలిగి గుండాల మండలాన్ని యాదాద్రిలో కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులచే రాజీనామాలు చేయించి ఆమోదింప చేయించుకునే బాధ్యత తమదేనన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అ«ధ్యక్షుడు బబ్బూరి సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్‌ దుంపల శ్రీనువాస్, తుర్కలషాపురం సర్పంచ్‌ పురుగుల మల్లయ్య, ఎంపీటీసీ సభ్యులు బూడిద రాములు, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు రాజరత్నం, నాయకులు బండారు వెంకటేష్, బిక్షం, తదితరులు ఉన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement