Congress Removed Rajagopal Reddy Supporters From Party, Details Inside - Sakshi
Sakshi News home page

రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులపై కాంగ్రెస్‌ వేటు

Published Wed, Aug 3 2022 5:17 PM | Last Updated on Wed, Aug 3 2022 7:06 PM

Congress Expelled Rajagopal Reddy Supporters From The Party - Sakshi

నల‍్గొండ: సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా తర్వాత.. మునుగోడులో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు, ఓ టౌన్‌ అధ్యక్షుడిపై వేటు వేసింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాజగోపాల్‌ రెడ్డి మద్దతుదారులను తొలగించినట్లు వెల్లడించారు డీసీసీ అధ్యక్షుడు.

చర్యలు తీసుకున్న వారిలో మునుగోడు- పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు- పల్లె వెంకన్న, నాంపల్లి- పూల వెంకటయ్య, మర్రిగూడ- రాందాస్ శ్రీనివాస్ సహా ఓ టౌన్‌ అధ‍్యక్షుడున్నారు. ముందుగా ఆరుగురు మండలాధ్యక్షులపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చౌటుప్పల్- మోదుగుల రమేష్, సంస్థాన్ నారాయణ పురం- కరెంట్ శ్రీనివాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇదీ చదవండి: Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! నా నిర్ణయం తప్పయితే క్షమించండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement