Rajagopalareddy
-
డబ్బులిచ్చి రేవంత్‌రెడ్డి పీసీసీ కొనుక్కున్నాడు: రాజగోపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం ఢిల్లీకి వెళ్లి బీజేపీ సీనియర్ నేత, కేంద్రం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగిస్తాం. ఈ ఉప ఎన్నికతో రాష్ట్రంలో మార్పు వస్తుంది. అమిత్ షా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈనెల 21న తెలంగాణకు అమిత్ షా వస్తారు. అదే రోజు బీజేపీలో చేరతాను. బహిరంగ సభ పెట్టి మరీ చేరతాను. ఈ నెల 8వ తేదీన స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ ఇస్తాను. బీజేపీకి అమ్ముడు పోయినట్లు రేవంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేకుంటే నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? అని రేవంత్‌కు సవాల్ విసిరారు రాజగోపాల్‌రెడ్డి. అంతేకాదు డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారంటూ రేవంత్‌పై ఆరోపణలు గుప్పించారు. రేవంత్ భాష, వ్యవహారశైలి అందరూ అస్యహించుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బయటకు వెళ్లగొడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వస్తున్నాయి. వెంకట్‌రెడ్డి అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా ’ అని స్పష్టం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఇదీ చదవండి: హోం మంత్రి అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్ -
రాజగోపాల్ రెడ్డి మద్దతుదారులపై కాంగ్రెస్ వేటు
నల్గొండ: సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత.. మునుగోడులో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉన్న నాలుగు మండలాల అధ్యక్షులు, ఓ టౌన్ అధ్యక్షుడిపై వేటు వేసింది. టీపీసీసీ ఆదేశాల మేరకు రాజగోపాల్ రెడ్డి మద్దతుదారులను తొలగించినట్లు వెల్లడించారు డీసీసీ అధ్యక్షుడు. చర్యలు తీసుకున్న వారిలో మునుగోడు- పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, చండూరు- పల్లె వెంకన్న, నాంపల్లి- పూల వెంకటయ్య, మర్రిగూడ- రాందాస్ శ్రీనివాస్ సహా ఓ టౌన్ అధ్యక్షుడున్నారు. ముందుగా ఆరుగురు మండలాధ్యక్షులపై చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. చౌటుప్పల్- మోదుగుల రమేష్, సంస్థాన్ నారాయణ పురం- కరెంట్ శ్రీనివాస్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదీ చదవండి: Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై! నా నిర్ణయం తప్పయితే క్షమించండి.. -
గురువును మించిన శిశ్యుడు
రాజగోపాలరెడ్డి కారు డ్రైవరే ‘పీజీఎంఈటీ-2014’ లీకువీరుడు బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్జీయూహెచ్ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్... కన్సార్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2011) బోగస్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాలరెడ్డికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎంఈటీ-2014) లీకేజ్‌లో సూత్రధారిగా సీఐడీ అధికారులు గుర్తించారు. ఇతడే కర్ణాటకలోని ఉడిపి, దావణగెరెలకు చెందిన మరికొందరితో కలిసి ముఠా కట్టి వ్యవహారాన్ని నడిపినట్లు నిర్థారించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తిచేసిన సీఐడీ ప్రత్యేక బృందాలు బుధవారం కీలక సూత్రధారులతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. వీరిని గురువారం అరెస్టు చేసే అవకాశం ఉంది.