pregnet wome
-
వరకట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ ప్రియ (24) గురువారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. కృష్ణ ప్రియ భర్త శ్రవణ్ కుమార్ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. కాగా తమ కూతురు కృష్ణ ప్రియను వేధింపులతో అత్తింటివారే పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకున్నారని, అదనంగా మరో రూ. 12 లక్షలు ఇవ్వాలంటూ తమ అల్లుడు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐదు కాసులు బంగారం పెడితేనే సీమంతానికి తమ ఇంటికి కృష్ణప్రియ పంపుతామని శ్రవణ్ తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భర్త శ్రవణ్ కుమార్, అతని తల్లిదండ్రులు మాత్రం తాము కృష్ణ ప్రియను వేధింపులకు గురి చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. -
దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది
గుండాల: కడుపులో బిడ్డ. పురిటి నొప్పులతో ఇద్దరు గర్భిణుల కష్టాలు. ఆస్పత్రికి వెళదామంటే అడ్డుకుంటున్న వాగు ఉధృతి. అన్నీ భరిసూ్తనే ఇద్దరూ కుటుంబ సభ్యుల సహకారంతో దేవుడా.. అంటూ వాగు దాటాల్సి వచ్చింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన లూనావత్ మమత నిండు గర్భిణీ కావడంతో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ద్విచక్ర వాహనంపై మల్లన్నవాగు వద్దకు తీసుకొచ్చారు. వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి గర్భిణిని ముగ్గురు కుటుంబ సభ్యులు అతికష్టం వీుద దాటించారు. అక్కడి నుంచి గుండాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే రోళ్లగడ్డ గ్రామానికి చెందిన ఈసం వనజ ఆరు నెలల గర్భవతి. నెలలు నిండకున్నా ఆమెకు నొప్పులు వస్తుండటంతో అదే వాగుపై నుంచి కుటుంబ సభ్యులు దాటించి ఆస్పత్రికి తరలించారు. వర్షాకాలంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తే గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారి పరిస్థితి ఏమిటని పలువురు గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణికి మెరుగైన వైద్యం అందించాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నూనావత్ మమత పురిటి నొప్పులతో బాధపడుతుండగా భుజాలపై మల్లన్న వాగును దాటించిన ఘటనపై సమగ్ర వివరాలందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలపాలని సూచించారు. -
ఆస్పత్రి బయటే మహిళ ప్రసవం
సాక్షి, నాగార్జునసాగర్ : ఆస్పత్రి ఆరుబయటే ఓ మహిళ ప్రసవించింది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి ఇక్కడ కాన్పు చేయలేమని నల్లగొండకు తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో.. వారు ఆసుపత్రి బయటకు రాగానే అక్కడే కాన్పు అయ్యింది. ఈ సంఘటన నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రి వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం జాల్‌తండాకు చెందిన విమోజకు శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు సాగర్ తీసుకొచ్చారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ అరవింద్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ లేడని.. గర్భిణి విమోజ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని నల్లగొండకు తీసుకెళ్లాలని రెఫర్ చేశాడు. ఆమె నొప్పి ఎక్కువగా ఉందని చెప్పినా.. డాక్టర్, సిబ్బంది పట్టించుకోకుండా నల్లగొండకు వెళ్లమని ఒత్తిడి చేశారు. వారు ఆస్పత్రి బయటకు వెళ్లగానే నొపులు ఎక్కువై అక్కడే కాన్పు అయ్యింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. తండాకు చెందిన ఆడవాళ్లే కాన్పు చేశారు. అనంతరం తల్లీ బిడ్డను ఆస్పత్రిలోకి అనుమతించారు. పురిటి నొప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. కనికరం చూపని డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త మోతీలాల్ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై డాక్టర్ అరవింద్‌ను వివరణ కోరగా.. తల్లి వద్ద రక్తం సరిపోయేంత లేకపోవడంతో పాటు గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతోనే నల్లగొండకు రెఫర్ చేసినట్లు తెలిపారు. అంబులెన్స్ మాట్లాడి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో ఇక్కడే డెలివరీ అయ్యిందని ఆ సమయంలో మా సిబ్బందిని వారు దగ్గరకు రానివ్వలేదని పేర్కొన్నారు. -
108లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని అడివెంల శివారులో 108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. బొల్లంపల్లి గ్రామానికి చెందిన బాషపాక సతీష్ భార్య శైలజ ఆదివారం పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండగా ప్రసూతి కోసం 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అడివెంల గ్రామ శివారులోకి రాగానే ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆమెది ఇది రెండోకాన్పు. తల్లీబిడ్డలకు అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స చేసి ఆ తరువాత సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది వల్లాల సత్యనారాయణ, తంగెళ్ల నిరంజన్ తెలిపారు.