సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని అడివెంల శివారులో 108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది.
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని అడివెంల శివారులో 108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. బొల్లంపల్లి గ్రామానికి చెందిన బాషపాక సతీష్ భార్య శైలజ ఆదివారం పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండగా ప్రసూతి కోసం 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అడివెంల గ్రామ శివారులోకి రాగానే ప్రసవించింది.
ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆమెది ఇది రెండోకాన్పు. తల్లీబిడ్డలకు అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స చేసి ఆ తరువాత సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది వల్లాల సత్యనారాయణ, తంగెళ్ల నిరంజన్ తెలిపారు.