Gives Birth
-
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
Khammam: ప్రభుత్వ ఆస్పత్రిలో అదనపు కలెక్టర్ ప్రసవం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కేంద్రం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకున్న అదనపు కలెక్టర్ స్నేహలత, ఆమె భర్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏఎస్పీ శబరీశ్‌లను రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన మంత్రి.. స్నేహలతకు జన్మించిన చిన్నారిని ఎత్తుకుని కాసేపు లాలించారు. భార్యాభర్తలిద్దరూ ఉన్నతాధికారులైనా.. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులపై మరింత గౌరవం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. చదవండి: కాళ్లు కడిగి.. కన్యాదానం చేసి.. ఆదర్శంగా నిలిచిన ముస్లిం దంపతులు చిన్నారిని ఎత్తుకున్న మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. చిత్రంలో స్నేహలత, ఆమె భర్త శబరీశ్ తదితరులు కాగా ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్నేహలత , భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్పీ శబరీస్ దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. స్నేహలత సామాన్య మహిళలా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. డెలివరీ టైం అని వైద్య సిబ్బంది కలెక్టర్ స్నేహలతకు అక్కడే డెలివరీ చేశారు. తల్లిబిడ్డా క్షేమమని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఈ కలెక్టరమ్మ డెలివరీ న్యూస్ నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడుపోసుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారంటూ స్నేహలతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నీ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల పై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అంటున్నారు. చదవండి: వాట్ ఎన్ ఐడియా సర్ జీ.. ఆర్టీసీలో ‘పెళ్లి సందడి’ -
అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది
బొగోటా(కొలంబియా): ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దారుణాలకు అడ్డులేకుండా పోతుంది. పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్లు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. అమ్మ ప్రేమ, నాన్న గారం.. స్నేహితులు, ఆటలు తప్ప మరొకటి తెలియని పదేళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత 26 రోజులుగా పసి గుడ్డును ఆ చిట్టితల్లి కాపాడుకుంటుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధితురాలి పేరు వెల్లడించలేదు. మరో దారుణం ఏంటంటే తనకు ఏం జరిగిందో.. ఎవరు తనపై ఇంత పశుత్వాన్ని ప్రదర్శించారో ఆ చిట్టితల్లి చెప్పలేకపోతుంది. ఎనిమిదో ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలయ్యిందని అధికారులు భావిస్తున్నారు. ప్రాడో మున్సిపాలిటిలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్ కేర్ సెంటర్లో ఉంచి సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో తొలిమా గర్నరర్ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీని గురించి ఆమె ఏం మాట్లడలేకపోతుంది. కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి(43), అక్కడే పొలాల్లో పని చేసే మరో వ్యక్తి(23)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇక ఇలాంటి దారుణాలు ఎక్కువగా బయటపడటం లేదు. చాలా కేసుల్లో కొడుకు, అంకుల్, తాత, సమీప బంధువులు నిందితులుగా ఉంటున్నారు. దాంతో ఈ దారుణాలను కప్పి పుచ్చుతున్నారు. ఇక కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు’ అన్నారు. -
కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చి..
టెన్నెస్సీ : కోమాలో ఉండగా మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలో వెలుగు చూసింది. కారు ప్రమాదం కారణంగా కోమాలోకి పోయిన ఓ గర్భిణి కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చింది. కోమాలోంచి బయటకు వచ్చిన ఆమె బిడ్డను చూసుకున్న కొన్ని రోజులకు కన్నుమూసింది. ఈ ఉదంతం టెన్నెస్సీలోని నాక్స్విలే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. శారిష్టా గెలస్ అనే మహిళ 2014 సంవత్సరంలో తన స్నేహితురాళ్లతో కలసి ఓ వేడుకకు వెళ్లి కారులో తిరిగి వస్తోంది. అప్పుడు జరిగిన కారు ప్రమాదంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో శారిష్టా నాలుగు నెలల గర్భవతి. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేదని ఆమె బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు అన్నారు. కోమాలో ఉన్న ఆమె 26 వారాల తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొద్ది నెలలకే ఆమె కళ్లు తెరచి బిడ్డను చూసుకుంది. అలా మంచంపై నుంచే మూడు సంవత్సరాల పాటు కన్న కొడుకు ఎదుగుదలను చూసుకున్న ఆమె పిల్లాడి మూడో పుట్టిన రోజు వేడుక జరిగిన కొద్ది రోజులకే మరణించింది. -
108లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని అడివెంల శివారులో 108 అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. బొల్లంపల్లి గ్రామానికి చెందిన బాషపాక సతీష్ భార్య శైలజ ఆదివారం పురిటినొప్పులతో ఇబ్బంది పడుతుండగా ప్రసూతి కోసం 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అడివెంల గ్రామ శివారులోకి రాగానే ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ జన్మించాడు. ఆమెది ఇది రెండోకాన్పు. తల్లీబిడ్డలకు అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స చేసి ఆ తరువాత సూర్యాపేటలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని అంబులెన్స్ సిబ్బంది వల్లాల సత్యనారాయణ, తంగెళ్ల నిరంజన్ తెలిపారు. -
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ పిల్లలు
చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో మనితా సింగ్ అనే 25 ఏళ్ల గర్భవతి ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సిజేరియన్ అవసరం లేకుండా సహజసిద్ధంగా ఐదుగురుకి ఒకే కాన్పులో జన్మనివ్వడం తన కెరీర్లో ఇదే మొదటిసారని డాక్టర్ టెకమ్ తెలిపారు. కేవలం 26 వారాలకే తల్లి మనితా సింగ్‌కు శనివారం నొప్పులు రావడంతో అంబికాపూర్ అస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత అరగంటకు నలుగురు ఆడబిడ్డలను ప్రసవించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాము ఎప్పుడు స్కానింగ్ చేయించలేదని, కడుపులో ఒకే బిడ్డ పురుడుపోసుకుందని భావించామని తండ్రి మనిష్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓ బాబు పుట్టి పోయాడని, ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే దేవుడు ఏకంగా ఐదుగురు సంతానాన్ని ఒకేసారి ఇచ్చి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురు పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఐదుగురు బిడ్డలు ప్రిమెచ్యూర్‌గా పుట్టారని, వారంతా కిలోన్నర చొప్పున బరువున్నారని డాక్టర్లు తెలిపారు. వారంతా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారిలో ఎంతమంది బతుకుతారో చెప్పలేమని, అయితే ప్రతి బిడ్డను బ్రతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు తెలిపారు. -
30వేల అడుగుల ఎత్తులో ప్రసవం
30వేల అడుగుల ఎత్తులో నెలలు నిండని శిశివుకు ఓ తల్లి జన్మనిచ్చింది. ఈ సంఘటన బాలీ నుంచి లాస్ ఏంజెల్స్ ప్రయాణిస్తున్న చైనా ఏయిర్ లైన్స్ విమానంలో చోటు చేసుంకుంది. దూరప్రయాణం చేస్తున్న తైవాన్‌కు చెందిన మహిళకు డెలివరీ సమయానికన్నా 8 వారాలు ముందుగానే పురిటి నోప్పులు వచ్చాయి. విమానంలో ఉన్న డాక్టర్‌కు సిబ్బంది సమాచారాన్ని అందించారు. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో విమానంలోని డాక్టర్, సిబ్బంది సహాయంతో మహిళకు డెలివరీ చేశారు. ఆ మహిళ ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఈ డెలివరీ అనంతరం జరిగిన పరిణామాలను ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. డెలివరీ చేసిన సిబ్బంది విమానంలోని దుప్పట్లలోకి ఆ పసికందును సంతోషంగా తీసుకోవండం, టిష్యూ పేపర్లతో ఆ చిన్నారిని, తల్లిని శుభ్రపరిచిన దృశ్యాలు అందులో ఉన్నాయి. ఈ సంఘటనతో విమానాన్ని అత్యవసరంగా అలస్కాలోని టెడ్ స్టీవెన్స్ ఆంకరేజ్ విమానాశ్రయంలో నిలిపి తల్లి, బిడ్డలను ఆంకరేజ్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మూడు గంటల ఆలస్యం అనంతరం ఆ విమానం మిగతా ప్రయాణికులతో లాస్ ఏంజెల్స్ చేరుకుంది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి విమాన సిబ్బంది, ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో ప్రయాణాలు చేశాను కానీ ఇలా విమానంలో నేను ప్రయాణిస్తున్న సమయంలోనే శిశివు జన్మించడం మరచిపోలేని సంఘటన అని ఓ ప్రయాణికుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఆ బిడ్డ విమానంలోనే జన్మించడంతో ఆంకరేజ్ లోని ఆస్పత్రి వర్గాలు ఇచ్చే బర్త్ సర్టిఫికెట్ ఆధారంగానే ఆ పసికందు జాతీయత ఆధారపడనుంది. -
తొలి కాన్పులో నలుగురు పిల్లలు
కాకినాడ: తొలి కాన్పులోనే ఓ మహిళ నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేళంగికి చెందిన ఆటోడ్రైవర్ కురుపూడి శ్రీనివాస్‌కు శాంతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఆమె రెండుసార్లు గర్భం దాల్చినా నిలవలేదు. దీంతో కాకినాడలోని రమ్య ఆస్పత్రికి వెళ్లగా గైనకాలజిస్ట్ డాక్టర్ పి.ప్రభావతి పరీక్షించి మందులు వాడించారు. అనంతరం గర్భం దాల్చిన ఆమె సోమవారం ఉదయం నలుగురు శిశువులకు జన్మనిచ్చింది.