బిడ్డను చూసుకుంటోన్న శారిష్టా గెలస్
టెన్నెస్సీ : కోమాలో ఉండగా మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఉదంతం అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలో వెలుగు చూసింది. కారు ప్రమాదం కారణంగా కోమాలోకి పోయిన ఓ గర్భిణి కోమాలో ఉండగానే బిడ్డకు జన్మనిచ్చింది. కోమాలోంచి బయటకు వచ్చిన ఆమె బిడ్డను చూసుకున్న కొన్ని రోజులకు కన్నుమూసింది. ఈ ఉదంతం టెన్నెస్సీలోని నాక్స్‌విలే ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. శారిష్టా గెలస్ అనే మహిళ 2014 సంవత్సరంలో తన స్నేహితురాళ్లతో కలసి ఓ వేడుకకు వెళ్లి కారులో తిరిగి వస్తోంది. అప్పుడు జరిగిన కారు ప్రమాదంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.
ఆ సమయంలో శారిష్టా నాలుగు నెలల గర్భవతి. ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేదని ఆమె బతికే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు అన్నారు. కోమాలో ఉన్న ఆమె 26 వారాల తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొద్ది నెలలకే ఆమె కళ్లు తెరచి బిడ్డను చూసుకుంది. అలా మంచంపై నుంచే మూడు సంవత్సరాల పాటు కన్న కొడుకు ఎదుగుదలను చూసుకున్న ఆమె పిల్లాడి మూడో పుట్టిన రోజు వేడుక జరిగిన కొద్ది రోజులకే మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment