Cow Gives Birth To Calf With Striking Resemblance To Lion In Madya Pradesh - Sakshi
Sakshi News home page

ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు

Published Fri, Apr 28 2023 1:58 PM | Last Updated on Fri, Apr 28 2023 3:57 PM

Cow Gives Birth To Calf With Striking Resemblance To Lion In Madya Pradesh - Sakshi

ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్‌ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్‌ శిల్పాకర్‌ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు.

ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్‌కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు.

అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన  సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు.
(చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్‌..144 సెక్షన్‌ విధింపు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement