108 ఉద్యోగుల సమ్మె వాయిదా | 108 Employees Strike Postponed In Vijayawada Andhra Pradesh After Meeting With Govt Official | Sakshi
Sakshi News home page

108 ఉద్యోగుల సమ్మె వాయిదా

Published Wed, Nov 27 2024 5:20 AM | Last Updated on Wed, Nov 27 2024 8:04 AM

108 Employees Strike Postponed: Andhra Pradesh

సాక్షి, అమరా­వతి: 108 ఉద్యో­గులు బుధ­వా­రం నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసు­­కుంటున్నట్లు ఏపీ 108 సర్వీసెస్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూ­నియన్‌ తెలిపింది. మంగళవారం జరిగిన చర్చల్లో ప్రభుత్వం పలు డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించడంతో సమ్మెను వాయిదా వేసుకు­న్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్‌ వెల్ల­డించారు.

సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, వైద్య సేవా ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ మంజుల చర్చలు జరిపినట్టు వివరించారు. ఈ సందర్భ­ంగా 108 సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సాధ్య­పడదని వారు తేల్చి చెప్పార­న్నారు. జీవో 49ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చార­న్నారు. కొత్త సర్వీస్‌ ప్రొవైడర్‌ను ఎంపిక చేయ­డానికి ఆర్‌ఎఫ్‌పీ రూపొందించే సమయంలో ఉద్యోగుల సలహాలు, సూచనలను తీసుకుని వాటిని అందులో పొందుపరుస్తామని హామీ ఇచ్చారన్నారు. చర్చల్లో ఆమోదించిన మిని­ట్స్‌ను రాతపూర్వకంగా అందించారని చెప్పా­రు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement