
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు.
జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్‌లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.