రాష్ట్రవ్యాప్త బంద్‌కు 108 ఉద్యోగుల పిలుపు | 108 Employees Call For Statewide Bandh | Sakshi
Sakshi News home page

రాష్ట్రవ్యాప్త బంద్‌కు 108 ఉద్యోగుల పిలుపు

Published Wed, Apr 25 2018 7:09 PM | Last Updated on Wed, Apr 25 2018 8:25 PM

108 Employees Call For Statewide Bandh - Sakshi

ఆందోళన చేస్తోన్న 108 ఉద్యోగులు(పాత చిత్రం)

అమరావతి : 108 నిర్వహణా సంస్థతో 108 ఉద్యోగుల చర్చలు విఫలం కావడంతో వారు రాష్ట్రవ్యాప్తంగా రేపు(గురువారం) బంద్‌కు పిలుపునిచ్చారు. 12 గంటల పనివేళలను 8 గంటలకు కుదించాలని, 50 శాతం జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. జీవీకే సంస్థ నుంచి రావాల్సి ఉన్న రూ.7 కోట్ల బకాయిలను ఇప్పించాలని కోరారు. గత ఆరు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 8 గంటల పని సమయం కేటాయించాలని లేదంటే తామే 8 గంటలు పని చేసి ఆ తర్వాత ఫోన్‌లు స్విఛ్‌ ఆఫ్‌ చేస్తామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement