
సాక్షి, హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్‌లో నివాసం ఉంటున్న కృష్ణ ప్రియ (24) గురువారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. కృష్ణ ప్రియ భర్త శ్రవణ్ కుమార్ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు.
కాగా తమ కూతురు కృష్ణ ప్రియను వేధింపులతో అత్తింటివారే పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకున్నారని, అదనంగా మరో రూ. 12 లక్షలు ఇవ్వాలంటూ తమ అల్లుడు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐదు కాసులు బంగారం పెడితేనే సీమంతానికి తమ ఇంటికి కృష్ణప్రియ పంపుతామని శ్రవణ్ తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భర్త శ్రవణ్ కుమార్, అతని తల్లిదండ్రులు మాత్రం తాము కృష్ణ ప్రియను వేధింపులకు గురి చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment