Jagadagari gutta
-
సినీ నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు
Police Case Filed On Karate Kalyani Over Saidabad Minor Girl Incident: సినీ నటి కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన నితేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో కరాటే కల్యాణిపై జగద్గిరి గుట్ట పీఎస్‌లో కేసె నమోదైంది. -
ఇంటి ముందు వాకింగ్ చేసి వస్తానని చెప్పి..
సాక్షి, జగద్గిరిగుట్ట( హైదరాబాద్): వాకింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చక్రధర్ నగర్, ఆల్విన్ కాలనీకి చెందిన సాయి పద్మిని (20) శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంటి ముందు వాకింగ్ చేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేదు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో దొంగల భీభత్సం
-
పెళ్లై 2 నెలలు.. చెల్లెలిని స్కూల్ నుంచి తీసుకొస్తానని..
ఆదివారం భారీగా అదృశ్యం కేసులు నమోదు అయ్యాయి. చెల్లెల్ని స్కూల్ నుంచి తీసుకువస్తానని చెప్పిన వివాహిత.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గృహిణి.. వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లిన వ్యక్తి.. అదృశ్యమయ్యారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత అదృశ్యమైన ఘటన పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుండ్లపోచంపల్లికి చెందిన దీపామాలా (20) కు రెండు నెలల క్రితం శత్రుధన్‌తో వివాహమైంది. ఈ నెల 3వ తేదీ సాయంత్రం తన చెల్లెలిని స్కూల్ నుంచి తీసుకువస్తానని చెప్పి వెళ్లిన దీపామాలా తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె అన్న రాజ్‌బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయటకు వెళ్లిన గృహిణి.. జగద్గిరిగుట్ట: ఇంటి నుండి బయటకు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చంద్రగిరినగర్‌కు చెందిన మహేష్, మనీష (25) లు భార్యాభర్తలు. వీరికి మయూర్, మనల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగం చేసే మనీష ఈ నెల 3న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చెత్తపారబోయడానికి వెళ్తున్నానని పిల్లలకు చెప్పి వెళ్లింది. అయితే సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త ఆమె కోసం వెతకగా ఆచూకీ తెలియలేదు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాపారం నిమిత్తం వెళ్లిన వ్యక్తి.. జగద్గిరిగుట్ట: వ్యాపారం నిమిత్తం వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలో చోటు కేసుకుంది. వల్లభాయ్ పటేల్‌నగర్‌కు చెందిన చొక్కయ్య కుమారుడు సతీష్ (29) ప్రైవేట్ ఉద్యోగి. వృత్తిరీత్యా వ్యాపారి. గత నెల 29న పని నిమిత్తం భద్రాచలంకు వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. అదే రోజు రాత్రి కుమారుడితో చొక్కయ్య మాట్లాడగా 30వ తేదీ ఉదయం ఫోన్‌చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి సతీష్ ఫోన్ స్విచ్ఛాప్ అయిందని, తాను సైట్లో ఉన్నానని చెప్పాడు. తిరిగి అతని ఫోన్‌ను ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సతీష్ కోసం వెతకగా అతని జాడ తెలియలేదు. ఆదివారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
చూస్తుండగానే మాయం.. సీసీటీవీలో చైన్ స్నాచింగ్ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్: జగద్గిరి గుట్ట పీఎస్ పరిధి శ్రీనివాస్ నగర్లో చైన్ స్నాచింగ్ జరిగింది. కవిత అనే మహిళ టైలర్ షాపుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి వెనుక నుండి ఆమెను వెంబడిస్తూ మెడలో నుండి 3.2 తులాల బంగారు గోలుసును లాక్కొని వెళ్లిపోయాడు. ఆ మహిళ అతడిని వెంబడించగా.. రోడ్డుపై మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై సిద్ధంగా ఉండడంతో దానిపై పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. చోరీ చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. చదవండి: ఏడాది కిత్రమే పెళ్లి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. జర జాగ్రత్త.. లాక్డౌన్ ఎత్తేశారని.. లైట్ తీసుకోవద్దు! -
వరకట్నం వేధింపులతో యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో విషాదం చోటు చేసుకుంది. వరకట్నం వేధింపులకు ఓ గృహిణి బలైంది. భర్త, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్లో నివాసం ఉంటున్న కృష్ణ ప్రియ (24) గురువారం ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణీ. కృష్ణ ప్రియ భర్త శ్రవణ్ కుమార్ జిమ్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు. కాగా తమ కూతురు కృష్ణ ప్రియను వేధింపులతో అత్తింటివారే పొట్టనబెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లిలో ఐదు లక్షల కట్నం తీసుకున్నారని, అదనంగా మరో రూ. 12 లక్షలు ఇవ్వాలంటూ తమ అల్లుడు డిమాండ్ చేశాడని తెలిపారు. ఐదు కాసులు బంగారం పెడితేనే సీమంతానికి తమ ఇంటికి కృష్ణప్రియ పంపుతామని శ్రవణ్ తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భర్త శ్రవణ్ కుమార్, అతని తల్లిదండ్రులు మాత్రం తాము కృష్ణ ప్రియను వేధింపులకు గురి చేయలేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. -
జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం..
-
జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం..
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్‌లో సోమవారం అర్థరాత్రి స్వల్వ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన పాపిరెడ్డి నగర ప్రాంత నివాసులంతా రోడ్లపైనే ఉండిపోయారు.