
సాక్షి, జగద్గిరిగుట్ట( హైదరాబాద్): వాకింగ్‌కు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చక్రధర్ నగర్, ఆల్విన్ కాలనీకి చెందిన సాయి పద్మిని (20) శుక్రవారం ఉదయం 6 గంటలకు ఇంటి ముందు వాకింగ్ చేసి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేదు. ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment