![Girl Goes Missing In Balanagar From Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/24/Balanagar.jpg.webp?itok=n3-8EJfW)
సాక్షి, బాలానగర్: మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి తిరిగి రాని సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ఎం.డి.వాహిదుద్దీన్ సమాచారం మేరకు... వినాయకనగర్‌లో నివాసం ఉండే ప్రియా పటేల్(24) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని రూ. 50 తీసుకొని బయటకు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లింది. పలు ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మతిస్థిమితం లేని వ్యక్తి...
బాలానగర్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృవ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ వాహిదుద్దీన్ సమాచారం మేరకు... బాలానగర్ డివిజన్ గురుమూర్తి నగర్‌కు చెందిన ఎం.డి.అహ్మద్ (50) ఈ నెల 16న సిగరెట్ కోసం పక్కనే ఉన్న పాన్‌డబ్బా వద్దకంటూ బయటికెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆయనకు మతిమరుపు, చెవుడు ఉంది. ఈ కారణాలతో గతంలో రెండుసార్లు తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment