Bala nagar
-
సార్.. మా అక్కను బావే చంపాడు
సాక్షి, బాలానగర్( హైదరాబాద్): తన అక్కను ఆమె భర్తే చంపాడంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఎండీ. వాహిదుద్దీన్ వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్‌కు చెందిన కొమరయ్య, దేవమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బాలానగర్‌లోని ఐడీపీయల్ గుడిసెల్లో ఉంటున్నారు. అయితే ఈ నెల 10వ తేదీన అనారోగ్యంతో దేవమ్మ (45), మృతి చెందగా బంధువుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. సోమవారం దేవమ్మ తమ్ముడు రాములు తన అక్కను బావే చంపాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా.. మృతురాలి కొడుకులు, చెల్లెలు మాత్రం అనారోగ్యంతోనే దేవమ్మ మృతి చెందినట్లుగా చెబుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికల్ షాపునకు వెళ్లి వస్తానన్న యువతి అదృశ్యం
సాక్షి, బాలానగర్: మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి తిరిగి రాని సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.డి.వాహిదుద్దీన్ సమాచారం మేరకు... వినాయకనగర్‌లో నివాసం ఉండే ప్రియా పటేల్(24) తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. మెడికల్ షాపునకు వెళ్లి వస్తానని రూ. 50 తీసుకొని బయటకు వచ్చిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లింది. పలు ప్రాంతాల్లో వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. మతిస్థిమితం లేని వ్యక్తి... బాలానగర్: మతిస్థిమితం లేని వ్యక్తి అదృవ్యమైన సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్‌న్ పరిధిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇన్స్పెక్టర్ వాహిదుద్దీన్ సమాచారం మేరకు... బాలానగర్ డివిజన్ గురుమూర్తి నగర్‌కు చెందిన ఎం.డి.అహ్మద్ (50) ఈ నెల 16న సిగరెట్ కోసం పక్కనే ఉన్న పాన్‌డబ్బా వద్దకంటూ బయటికెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆయనకు మతిమరుపు, చెవుడు ఉంది. ఈ కారణాలతో గతంలో రెండుసార్లు తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
పాజిటివ్ అని చుక్కలు చూపించారు.. కానీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన రోగులు కొన్ని చోట్ల తీవ్రమైన వివక్షకు గురైన పలు సంఘటనలు చూశాం. ఈ మహామ్మరి బారిన పడ్డవారిని కొంతమంది తమ ఇళ్లలోకి, గ్రామాల్లోకి రాకుండా అడ్డుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే తనకు కరోనా సోకిన సమయంలో వివక్షకు గురైనట్లు బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసే చెనిగల్ల శేఖర్ తెలిపారు. తనకు గత ఏడాది జూన్‌లో కోవిడ్-19 సోకిందని ఆ సమయంలో రంగారెడ్డి జిల్లాలోని అల్లోర్ గ్రామస్తులు దారుణంగా తనపై వివక్ష చూపించారని వాపోయారు. అవగాహనతో మెలగాల్సిన గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కూడా అదే వైఖరితో ఉండటంతో తీవ్రమైన అవమానాలు ఎదురయ్యాయని తెలిపారు. ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విధించారని, ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలని ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చాడు. దీంతో తాను నెల రోజుల పాటు ఇంటి నుంచి కాలు కూడా బయట పెట్టలేదని పేర్కొన్నాడు. రెండు వారాల తర్వాత కరోనా పరీక్ష చేయించుకోవడానికి కూడా అనుమతించకుండా దారుణమైన వివక్ష చూపారని గుర్తు చేసుకున్నాడు. కాగా, శేఖర్ గత ఎమిదేళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్నారు. ఇటీవల తొలి విడత వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో టీకా వేయించుకున్నారు. కరోనాకు వ్యాక్సిన్ రావటం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా శేఖర్ పేర్కొన్నాడు. తను పనిచేస్తున్న ఆరోగ్య కేంద్రంలోని సీనియర్ వైద్య సిబ్బంది నుంచి ప్రేరణ పొంది వ్యాక్సినేషన్ విధుల్లో భాగమయ్యానని వెల్లడించారు. -
హైదరాబాద్ బాలానగర్‌లో భారీ పేలుడు
-
దాతృత్వం చాటిన బాల్ లింగం
-
విద్యార్థులను వీడియో తీసిన మహిళా టీచర్
హైదరాబాద్: కాసుల కక్కుర్తితో విలువలకు పాతర వేస్తున్న కార్పొరేట్ స్కూళ్లలో మరో బాగోతం వెలుగుచూసింది. తమ స్వలాభం కోసం విద్యార్థుల జీవితాలను ఫణంగా పెట్టేందుకు కార్పొరేట్ స్కూళ్లు వెనుకాడడం లేదు. బాలానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఘటన కార్పొరేట్ స్కూళ్ల మధ్య జరుగుతున్న అనారోగ్యకర, అనైతిక పోటీకి అద్దం పడుతోంది. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ టెరాస్ పై సన్నిహితంగా ఉండగా పక్కనే ఉన్న మరో పాఠశాలకు చెందిన మహిళా టీచర్ ఈ దృశ్యాన్ని తన మొబైల్ తో వీడియో తీసింది. దాన్ని ప్రిన్సిపాల్ కు చూపించింది. తమకు పోటీగా ఉన్న సదరు స్కూల్ కు చెడ్డపేరు తేవాలన్న ఆలోచనతో ఆయన ఈ వీడియోను వాట్సాప్ లో షేర్ చేశాడు. ఈ వీడియో విపరీతంగా సర్క్యూలేట్ అయి కొంతమంది మీడియా రిపోర్టర్లకు చేరింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా చూడాలంటే తమకు డబ్బు ఇవ్వాలని వీడియోకు సంబంధించిన పాఠశాల యాజమాన్యాన్ని వారు బెదిరించారు. చివరకు విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలికతో సన్నిహితంగా మెలగిన బాలుడు, వీడియో తీసిన టీచర్, దాన్ని షేర్ చేసిన ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమ్యాన్ని బెదరించిన మీడియా రిపోర్టర్లపైనా దర్యాప్తు చేపట్టామని బాలానగర్ పోలీసు ఇన్స్ పెక్టర్ భిక్షపతి తెలిపారు. -
బాలానగర్‌లో కార్డన్ సెర్చ్
-
శ్రమజీవి శ్రీహరి
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు సినీప్రపంచంలో రియల్ హీరోగా సుస్థిరస్థానాన్ని ఏర్పరుచుకున్న నటుడు శ్రీహరి శ్రమజీవి. సినీ నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో ఎదిగారు. ఆయన పక్కా హైదరబాదీ. నగరంలోనే పుట్టి పెరిగారు. చిన్నాపెద్దా అందరితో ఎంతో కలివిడిగా ఉండేవారు. ముఖ్యంగా శ్రీహరన్నగా సిటీలోని పహిల్వాన్లకు చిరపరిచితులు. దేహదారుఢ్యంపై మొదటినుంచి ఆసక్తి ఉన్న శ్రీహరి మొదట నగరంలోని బాలానగర్‌లో ఓ జిమ్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక యువతకు అందులో శిక్షణ ఇచ్చేవారు. సినిమాల్లో నటించాలనే అకాంక్షతో మొదటి నుంచి కూడా తన శరీరాకృతిపై శ్రద్దచూపేవాడు. నిత్యం వ్యాయామం చేస్తూ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొనేవాడు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు దృష్టిలో పడడంతో ఆయన తన బ్రహ్మనాయుడు చిత్రంలో శ్రీహరికి అవకాశమిచ్చారు. సికింద్రాబాద్‌లో విద్యాభ్యాసం కృష్ణా జిల్లా గుడివాడ తాలుకా మల్లకుర్లు గ్రామానికి చెందిన సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి బాలానగర్‌లో స్థిరపడ్డారు. వీరి రెండో కుమారుడు శ్రీహరి. సత్యనారాయణ హెచ్ఏఎల్లో సివిల్‌కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. శ్రీహరి బోయిన్‌పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలో పదవ తరగతి వరకు చదివారు. సికింద్రాబాద్‌లోని న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియెట్, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రాంగణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. నిజాం కళాశాలలో పీజీ చేశారు. తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయకారిగా ఉండేందుకు చిన్నప్పుడు స్కూలుకు వెళ్తూనే ఇళ్లల్లో పాల ప్యాకెట్లు వేసేవారు. స్కూటర్ మెకానిక్ షెడ్డులో కూడా పనిచేశారు. కూతురు సమాధి పక్కనే.. బాచుపల్లి గ్రామంలో శ్రీహరికి ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులోనే శ్రీహరి అంత్యక్రియలు జరగనున్నాయి. శ్రీహరి ఏకైక కూతురు అక్షర అంత్యక్రియలను కూడా బాచుపల్లిలోనే నిర్వహించారు. కూతురి మృతి తరువాత అక్షర పేరుమీద ఒక ఫౌండేషన్‌ను శ్రీహరి స్థాపించారు. ఫౌండేషన్ తరఫున రంగారెడ్డి జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న అనంతారం, లక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాం ట్లను ఏర్పరిచి తాగునీటి వసతి కల్పించారు. ఆ గ్రామాల ప్రజలు శ్రీహరి అకాల మరణాన్ని తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీహరి అకాల మరణంతో సినీ పరిశ్రమ కూడా దిగ్బ్రాంతికి లోనైంది. ఆయనతో తమకున్న అనుబంధాన్ని సినీ ప్రముఖులు, కార్మికులు గుర్తుచేసుకున్నారు. నెరవేరని కల సినీనటుడిగా తెలుగు ప్రజల హృదయాలలో చోటు సంపాదించిన రియల్‌స్టార్ శ్రీహరి రాజకీయ కల మాత్రం నెరవేరలేదు. పలుమర్లు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినప్పటికీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. దివంగత వైఎస్. రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీహరి ప్రచారం కూడా చేశారు. రానున్న ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కోరుకున్నారు. శ్రీహరి యువసేన పేరుతో స్థానికంగా ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.