కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచల శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసేందుకు మంగళవారం కాలినడకన బయలు దేరారు. రెండు రోజులపాటు సాగే ఈ పాదయాత్ర కొత్తగూడెం గణేశ్ ఆలయంలో పూజలు చేయటంతో మొదలైంది. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు. యాత్ర ఇల్లందు క్రాస్‌రోడ్డు మీదుగా పాల్వంచ పెద్దమ్మగుడి వద్దకు సాయంత్రానికి చేరుకుంటుంది. రాత్రి అక్కడ బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై బూర్గంపాడు మీదుగా సాయంత్రానికి భద్రాచలానికి చేరుకుంటుంది.