MLA jalagam venkat rao
-
మిషన్ భగీరథతో ఇంటింటికీ గోదావరి జలాలు
పాల్వంచరూరల్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా పాల్వంచ మండలం తొగ్గూడెంలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు గోదావరి జలాలు చేరాయి. ఆదివారం ఎమ్మెల్యే ఏరియేటర్లోకి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించి, గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసి పట్టుదలతో ఇంటింటికీ గోదావరి జలాలు చేరేవిధంగా కృషి చేస్తున్నారన్నారు. తొగ్గూడేనికి గోదావరి జలాలు విజయవంతంగా చేరడం హర్షణీయమన్నారు. సోమవారం అధికారికంగా ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈలు సాయి, తాతారావు, జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు జీవీకే.మనోహర్, అయితా గంగాధర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భువనసుందర్రెడ్డి పాల్గొన్నారు. -
సింగరేణి బోనస్‌పై జలగం హర్షం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ గా రూ.25 వేలు ప్రకటిం చడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతేడాది రూ.18 వేలుగా ఉన్న ఈ బోనస్‌ను రూ.7వేలు పెంచి ఈ సారి రూ.25 వేలుగా ఇవ్వాలని సీఎం నిర్ణయించారని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎంకు కార్మికులపై ఉన్న ప్రేమాభిమానాలకు ఇది నిదర్శమని.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జలగం వెల్లడించారు. -
భద్రాచలానికి ఎమ్మెల్యే జలగం పాదయాత్ర
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భద్రాచల శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేసేందుకు మంగళవారం కాలినడకన బయలు దేరారు. రెండు రోజులపాటు సాగే ఈ పాదయాత్ర కొత్తగూడెం గణేశ్ ఆలయంలో పూజలు చేయటంతో మొదలైంది. పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు సంఘీభావం ప్రకటించారు. యాత్ర ఇల్లందు క్రాస్‌రోడ్డు మీదుగా పాల్వంచ పెద్దమ్మగుడి వద్దకు సాయంత్రానికి చేరుకుంటుంది. రాత్రి అక్కడ బస చేస్తారు. తిరిగి బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై బూర్గంపాడు మీదుగా సాయంత్రానికి భద్రాచలానికి చేరుకుంటుంది.