ట్యాంకు వద్ద పూజలు చేస్తున్న ఎమ్మెల్యే జలగం
పాల్వంచరూరల్ : మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలు అందించనున్నట్లు ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేర్కొన్నారు. మిషన్ భగీరథలో భాగంగా పాల్వంచ మండలం తొగ్గూడెంలో నిర్మించిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు గోదావరి జలాలు చేరాయి. ఆదివారం ఎమ్మెల్యే ఏరియేటర్‌లోకి నీటిని పంపింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించి, గంగమ్మతల్లికి పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరి కాయలు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జలగం మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానస పుత్రిక మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన చేసి పట్టుదలతో ఇంటింటికీ గోదావరి జలాలు చేరేవిధంగా కృషి చేస్తున్నారన్నారు.
తొగ్గూడేనికి గోదావరి జలాలు విజయవంతంగా చేరడం హర్షణీయమన్నారు. సోమవారం అధికారికంగా ట్రయల్‌రన్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈలు సాయి, తాతారావు, జెడ్పీ వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, పెద్దమ్మగుడి మాజీ చైర్మన్ వెంకటేశ్వర్లు, నాయకులు జీవీకే.మనోహర్, అయితా గంగాధర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు భువనసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment