సమాజంలో మహిళల పాత్ర కీలకం | Womens Day special | Sakshi
Sakshi News home page

సమాజంలో మహిళల పాత్ర కీలకం

Published Fri, Mar 8 2019 3:04 PM | Last Updated on Fri, Mar 8 2019 3:08 PM

Womens Day special - Sakshi

  ఆటలు ఆడుతున్న మహిళలు 

సాక్షి, సుజాతనగర్‌:  సమాజంలో మహిళలు  పాత్ర కీలకమైనదని ఐసీడీఎస్‌ సింగభూపాలెం సెక్టార్‌ సూపర్‌వైజర్‌ పయ్యావుల రమాదేవి అన్నారు. శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగభూపాలెం సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఆత్మ విశ్వాసంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాలలో మహిళలు రాణించాలన్నారు.  ఉపాధ్యాయులు మన్నా, పుల్లయ్య, అంగన్‌వాడీ టీచర్లు వి.జ్యోతి, నరసమ్మ, వరలక్ష్మి, శేషుమణి, శశికళ, లలిత, సరస్వతి, పార్వతి, నాగమణి, పద్మ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. 

శరణాలయంలో పండ్లు పంపిణీ 
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్‌ సేవా సమితి ఆధ్వర్యంలో శరణాలయంలో గురువారం  పండ్లు పంపిణీ చేశారు. చాతకొండలోని హమాలీ కాలనీలోగల జ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో సేవా అధ్యక్షురాలు పద్మజా శంకర్‌ పండ్లు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ వారం రోజులుగా సింగరేణి కాలనీలలో మహిళలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించడం జరిగిందని, మహిళా దినోత్సవం రోజున సీఈఆర్‌ క్లబ్‌లో జరిగే వేడుకల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పీఓ బేతిరాజు, సేవా సెక్రటరీ సుమభాను, సభ్యులు శ్రీలత, పుష్పలత, రమాదేవి, మునీల, సుజాత, ఝాన్సీరాణి, రాజేశ్వరి, అరుణ, పద్మ, సేవా కో–ఆర్డినేటర్‌ ఈఏ.షరీఫ్‌ పాల్గొన్నారు.

 ఇందిరాకాలనీ పాఠశాలలో..   
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): లక్ష్మీదేవిపల్లి మం డలం ఇందిరానగర్‌కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగే మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని  బాలికలకు ఫ్యాన్సీడ్రెస్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు సింగరేణి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విభాగం సీనియర్‌ రోవర్‌ లీడర్, ఉపరాష్ట్రపతి అవార్డు గ్రహీత మహమ్మద్‌ ఖాశీం బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం జ్యోతిరాణి, విద్యావలంటీర్లు సైదమ్మ, విజయలక్ష్మి, అరుణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు 
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలరీస్‌ కొత్తగూడెం ఏరియాలోని లేడీస్‌ క్లబ్‌ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు గురువారం ఆటల పోటీలు నిర్వహించారు. ఎస్‌ఓ టూ జీఎం నారాయణరావు  పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతీ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నదని అన్నారు. దీనిలో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని లేడీస్‌ క్లబ్‌ మెంబర్స్, మహిళా ఉద్యోగులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు శుక్రవారం ఆర్‌సీఓఏ క్లబ్‌లో జరిగే వేడుకల్లో బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.

వాలీబాల్‌ ఆడుతున్న క్లబ్‌ సభ్యులు, మహిళా ఉద్యోగులు  

కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్‌  శ్రీనివాస్, డీవైపీఎంలు కిరణ్‌బాబు, సీహెచ్‌.అశోక్, లేడీస్‌ క్లబ్‌ సెక్రెటరీ మాధవి నారాయణరావు, సునీత మురళి, టీబీజీకేఎస్‌ పిట్‌ సెక్రెటరీ వజ్రమ్మ, సమన్వయకర్తలు సంగారావు, సాయికృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, లేడీస్‌ క్లబ్‌ మెంబర్స్, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement