'ప్రపంచ మహిళా దినోత్సవం' సందర్భంగా లండన్‌లో వేడుకను జరుపుకుంటున్న భారతీయ మహిళలు
'తెలుగు లేడీస్ ఇన్ యూకే' ఫేస్బుక్ గ్రూప్‌తో బంధం
గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు
ఉద్యోగ, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల చేయూతే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం
లండన్‌లోని థేమ్స్ నదిపై ప్రైవేట్ క్రూయిజ్‌లో ఘనంగా వేడుకలు
'ఒకటి ఒకటి కలిపితే రెండు కాదు, తోడుగా నిలబడితే 11 అని చాటుతూ, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రవాస మహిళలు 'తెలుగు లేడీస్ ఇన్ యూకే' అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఉమెన్స్ డే వేడుకలు జరుపుకున్నారు'.
ఈ ‘తెలుగు లేడీస్ యూకే (UK)’ గ్రూపును శ్రీమతి శ్రీదేవి మీనావల్లి డిసెంబర్ 2011న ప్రారంభించారు. ఈ టీఎల్‌యూకే (TLUK) గ్రూపులో సుమారు 5,000 మంది పైగా తెలుగు మహిళలు ఉన్నారు. బ్రిటన్కు వలస వచ్చే తెలుగు ఆడపడుచుల అందరికీ నూతన పరిచయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్యా, వైద్య, ఆర్థిక సందేహాలు, సలహాల ద్వారా చేయూతను అందించడమే ఈ గ్రూప్ ముఖ్య ఉద్దేశం అని శ్రీదేవి గారు తెలిపారు.
ప్రతి సంవత్సరంలా కాకుండా వినూత్నంగా ఈ ఏటా సెంట్రల్ లండన్ లోని థేమ్స్ నదిపై ఒక ప్రైవేట్ క్రూయిజ్ లో ఈ వేడుకలు జరుపుకున్నారు.
థేమ్స్ నదిపై నాలుగు గంటల పాటు ప్రయాణం చేస్తూ విందు వినోదాలతో ,ఆటపాటలతో, లైవ్ ఎంటర్టైన్మెంట్ అందరూ ఉల్లాసంగా గడిపారు.
ఆట పాటలతో పాటు రాఫెల్ ద్వారా ఈ గ్రూపు నిర్వహించే విద్యా వైద్య సేవా కార్యక్రమాల్లో తోడ్పడి మహిళలందరూ తమ చేయూతను అందించారు. మహిళలు ఇల్లే కాదు సమాజ అభివృద్ధికి కూడా ఎంత కీలకమో చాటిచెప్పారు. ఈ ఈవెంట్‌లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, జ్యోతి సిరపు, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment