
బూర్గంపాడు: మాతృ దినోత్సవం నాడే ఓ తల్లి కంటతడి పెట్టింది. ఇంటి నుంచి కొడుకు గెంటేయడంతో మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని సారపాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. వృద్ధాప్యంలోనూ ఆ దంపతులు కలిసే ఉండేవారు. రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దీంతో కోటమ్మ ఒంటరిగానే ఉంటోంది. కోటమ్మ నివాసం ఉండే ఇల్లు విషయంలో కొడుకు శ్రీనివాసరెడ్డికి, తల్లికి మధ్య విభేదాలు రావడంతో శనివారం తల్లితో శ్రీనివాసరెడ్డి గొడవ పెట్టుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్దే మౌనదీక్షకు దిగింది.
Comments
Please login to add a commentAdd a comment