thrown out
-
అమ్మను గెంటేశాడు
బూర్గంపాడు: మాతృ దినోత్సవం నాడే ఓ తల్లి కంటతడి పెట్టింది. ఇంటి నుంచి కొడుకు గెంటేయడంతో మౌన దీక్షకు దిగింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా పరిధిలోని సారపాకు చెందిన అయిలూరి రంగారెడ్డి, వెంకట కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసేశారు. వృద్ధాప్యంలోనూ ఆ దంపతులు కలిసే ఉండేవారు. రంగారెడ్డి అనారోగ్యంతో ఇటీవల మరణించాడు. దీంతో కోటమ్మ ఒంటరిగానే ఉంటోంది. కోటమ్మ నివాసం ఉండే ఇల్లు విషయంలో కొడుకు శ్రీనివాసరెడ్డికి, తల్లికి మధ్య విభేదాలు రావడంతో శనివారం తల్లితో శ్రీనివాసరెడ్డి గొడవ పెట్టుకుని ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆదివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ఇంటి వద్దే మౌనదీక్షకు దిగింది. -
కని పారేశారు..
సాక్షి, వికారబాద్ : ముక్కుపచ్చలారని ఓ పసికందు (అప్పుడే పుట్టిన పాప)ను గుర్తుతెలియని వారు ముళ్లపొదల్లో పడేశారు. దీంతో ఓ కుక్క ఆ పసికందును పట్టుకెళ్తుండగా ఓ రైతు గమనించి పాపను కాపాడాడు. అనంతరం పాపను మర్పల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాబు అనే రైతు శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి నుంచి పొలానికి వెళ్తున్నాడు. దారిలోని పొదల్లో పడి ఉన్న పసికందును కుక్క తన నోటితో పట్టుకుని వెళ్తుండగా గుర్తించాడు. వెంటనే కుక్కను వెళ్లగొట్టి పాపను రక్షించాడు. తర్వాత పాపను మర్పల్లిలోని కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి వైద్యులు పంపించారు. -
లైంగిక దాడి.. మేడపై నుంచి తోసి
ముంబై : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు అనంతరం ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన గురువారం ముంబైలోని ఎమ్ఐడీసీ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని ఎమ్ఐడీసీకి చెందిన 17 ఏళ్ల యువతి అత్తమామలతో కలిసి ఓ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో నివాసముంటోంది. అదే అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో నివాసముంటున్న 21 ఏళ్ల యువకుడు ఆ యువతి పని మీద బయటకు వెళుతున్న సమయంలో ఇంటిలోపలికి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి చాలా సేపటినుంచి కనిపించకపోవటంతో ఆమె మామ వెతకటం మొదలుపెట్టాడు. యువతిని రెండో ఫ్లోర్‌లోని యువకుడు ఇంటి లోపలికి లాక్కెళ్లాడన్న విషయం తెలుసుకుని అతడి ఇంటి తలుపు తట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఆమెను రెండో అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో అంతస్తు మీద నుంచి కిందపడ్డ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన కొంతమంది ఆమె మామకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా
-
మాజీ కేంద్ర మంత్రికి తీవ్ర పరాభవం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో బలగాల ఫైరింగ్ లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్‌కు చుక్కెదురైంది. ఆయనతోపాటు ఉన్న జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝా కూడా తిరస్కృతిని ఎదుర్కొన్నారు. కశ్మీర్ అల్లర్లను అదుపు చేసేందుకు బలగాలు జరిపిన పెల్లెట్స్ గన్స్ కాల్పుల్లో గాయపడిన వారంతా ప్రస్తుతం ఎస్ఎంహెచ్ఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని పరామర్శించేందుకు కొందరు జర్నలిస్టులు సహా మణిశంకర్ అయ్యర్ ఇతర మాజీ అధికారుల బృందం ఆస్పత్రికి వెళ్లింది. అయితే, ఆస్పత్రి వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు వారిని అక్కడికి రానివ్వలేదు. గో ఇండియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే ఆస్పత్రి ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. కశ్మీర్ లోయలో ఇంత జరుగుతున్నా పరామర్శపేరిట ఇన్ని రోజులకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము హంతకులతో, హత్యలకు మద్దతిచ్చేవారితో చేయి కలపబోమని మణిశంకర్ పై మండిపడ్డారని తెలుస్తోంది. అనంతరం కొందరు జర్నలిస్టులను మాత్రం గాయపడిన వారిని ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతించారు. -
గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..!
లండన్: ప్రియుడైనా.. ప్రియురాలైనా ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. అలా ఉండకుంటే వారిద్దరికే మోసం. హద్దులు దాటడం అన్నిసార్లు మంచిది కాదు. అలాగని కొన్నిసార్లు దాటడం కూడా పద్దతి కాదు. అదే జరిగితే ఆ బంధం ఉండొచ్చు.. ఊడిపోవచ్చు. స్నేహం, ప్రేమవంటివన్నీ హద్దులు దాటితే పెటాకులు అవకతప్పదు. లండన్‌లో ఓ ప్రేమికుడికి ఇదే జరిగింది. తన గర్ల్‌ఫ్రెండే కదా అని అతి చేయబోయాడు. తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. చివరకు జైలు పాలయ్యాడు. రైస్ వెదర్ బర్న్(20) అనే యువకుడు ప్రేమికుల రోజు సందర్బంగా లండన్‌లోని రిట్జ్ అనే ప్రతిష్టాత్మక హోటల్లో రాత్రి తన ప్రియురాలితో కలిసి రోమాన్స్ చేసేందుకు రూ.31,345 పెట్టి ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి మందేశారు. లెక్కలేనన్ని కబుర్లు చెప్పుకున్నారు. ప్రేమికుల రోజును గుర్తు చేసుకుంటూ వారి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. ఆ తర్వాత అసలు పంచాయితీ మొదలైంది. మెల్లగా రైస్ తన ప్రియురాలిపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. లైంగికంగా దాడి చేసేందుకు తెగించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె గట్టిగా కేకలు వేసింది. రక్షించండి.. రక్షించండి అంటూ గోడలు బద్ధలయ్యేలా అరిచింది. వారి పక్క గదిలో ఉన్నవారు ఆ కేకలు విని హోటల్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు వచ్చి రైస్ వెదర్‌ను మెడపట్టి బయటకు గెంటేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని కోర్టు బోనులో నిలబెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరి కేసును వాదిస్తూ రైస్ తన ప్రియురాలి మధ్య దాదాపు ఏడాది బంధం ఉందని గుర్తు చేశారు. తాగిన మైకంలో అలా చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అన్నారు. అయితే, అతడిని హోటల్ సిబ్బంది బయటకు గెంటేసే సమయంలో అద్దాలు పగలగొట్టడం వంటి చర్యలకు దిగాడు. ఫలితంగా మార్చి 2 వరకు అతడికి జైలు శిక్ష విధించారు.