గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..! | Drunken boyfriend thrown out of The Ritz on Valentine's Day | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..!

Published Thu, Feb 18 2016 11:15 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..! - Sakshi

గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..!

లండన్: ప్రియుడైనా.. ప్రియురాలైనా ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. అలా ఉండకుంటే వారిద్దరికే మోసం. హద్దులు దాటడం అన్నిసార్లు మంచిది కాదు. అలాగని కొన్నిసార్లు దాటడం కూడా పద్దతి కాదు. అదే జరిగితే ఆ బంధం ఉండొచ్చు.. ఊడిపోవచ్చు. స్నేహం, ప్రేమవంటివన్నీ హద్దులు దాటితే పెటాకులు అవకతప్పదు. లండన్లో ఓ ప్రేమికుడికి ఇదే జరిగింది. తన గర్ల్ఫ్రెండే కదా అని అతి చేయబోయాడు. తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. చివరకు జైలు పాలయ్యాడు.

రైస్ వెదర్ బర్న్(20) అనే యువకుడు ప్రేమికుల రోజు సందర్బంగా లండన్లోని రిట్జ్ అనే ప్రతిష్టాత్మక హోటల్లో రాత్రి తన ప్రియురాలితో కలిసి రోమాన్స్ చేసేందుకు రూ.31,345 పెట్టి ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి మందేశారు. లెక్కలేనన్ని కబుర్లు చెప్పుకున్నారు. ప్రేమికుల రోజును గుర్తు చేసుకుంటూ వారి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. ఆ తర్వాత అసలు పంచాయితీ మొదలైంది. మెల్లగా రైస్ తన ప్రియురాలిపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు.

లైంగికంగా దాడి చేసేందుకు తెగించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె గట్టిగా కేకలు వేసింది. రక్షించండి.. రక్షించండి అంటూ గోడలు బద్ధలయ్యేలా అరిచింది. వారి పక్క గదిలో ఉన్నవారు ఆ కేకలు విని హోటల్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు వచ్చి రైస్ వెదర్ను మెడపట్టి బయటకు గెంటేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని కోర్టు బోనులో నిలబెట్టారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరి కేసును వాదిస్తూ రైస్ తన ప్రియురాలి మధ్య దాదాపు ఏడాది బంధం ఉందని గుర్తు చేశారు. తాగిన మైకంలో అలా చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అన్నారు. అయితే, అతడిని హోటల్ సిబ్బంది బయటకు గెంటేసే సమయంలో అద్దాలు పగలగొట్టడం వంటి చర్యలకు దిగాడు. ఫలితంగా మార్చి 2 వరకు అతడికి జైలు శిక్ష విధించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement