30వరకూ కోళ్లకు ఉచితంగా టీకాలు | free vaccinnes of hens since 30th | Sakshi
Sakshi News home page

30వరకూ కోళ్లకు ఉచితంగా టీకాలు

Published Fri, Jan 20 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

free vaccinnes of hens since 30th

అనంతపురం అగ్రికల్చర్‌ : పెరటికోళ్లకు కొక్కెర, బొబ్బతెగుళ్ల నివారణకు శుక్రవారం నుంచి ఉచితంగా టీకాలు కార్యక్రమం ప్రారంభమైందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ వి.రవీంద్రనాథఠాగూర్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్‌ ఎన్‌.రామచంద్ర శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఈనెల 30వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. గడువులోగా 6 లక్షల పెరటికోళ్లకు టీకాలు వేయడంతో పాటు డీవార్మింగ్‌ మందులు కూడా తాపుతామన్నారు.ఈ అవకాశాన్ని గ్రామీణులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement