సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్‌కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు.
సమయం మరో 2 గంటలైనా పెంచండి
ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్‌డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు)
Comments
Please login to add a commentAdd a comment