Justice CV Nagarjuna Reddy
-
గత నెల ఎంత వస్తే అంతే కట్టండి!
సాక్షి, అమరావతి: మార్చి నెలలో వచ్చిన విద్యుత్ బిల్లులే ఏప్రిల్ నెలకూ వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున సిబ్బంది ఇంటింటికీ వెళ్లి విద్యుత్ బిల్లులు తీయడం సాధ్యం కాదని రాష్ట్ర డిస్కమ్‌లో కమిషన్ దృష్టికి తీసుకెళ్లాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మార్చి (ఫిబ్రవరి వినియోగం)లో వచ్చిన కరెంట్ బిల్లే ఏప్రిల్‌కూ వర్తింపజేస్తూ ఆదేశాలిచ్చారు. సమయం మరో 2 గంటలైనా పెంచండి ప్రభుత్వానికి పౌల్ట్రీ రైతుల విన్నపం సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలను సడలించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు. రైతుల ఇక్కట్లను దృష్టిలో ఉంచుకుని మరో రెండు గంటల పాటు చికెన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్, ఏపీ రైతు సంఘాలు కోరాయి. (కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు) -
ఇదెంత న్యాయమో!
హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డిపై పార్లమెంట్లో రెండోసారి అభిశంసన తీర్మానం తీసుకరావడానికి విఫలయత్నం జరిగినట్లు తెల్సింది. కొద్ది మంది రాజకీయ నాయకుల కారణంగా నాగార్జున రెడ్డి రుజువర్తన ప్రశ్నార్థకమవడం శోచనీయం. ఇది ఆయన ఒక్కరిని శంకించడం కాదు, సమస్త న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని శంకించడమే అవుతుంది. ఓ న్యాయమూర్తిపై అభిశంస తీర్మానం తీసుకరావడం మామూలు విషయమూ కాదు, ఆషామాషీ వ్యవహారమూ కాదు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్‌లోని ఉభయసభలు మూడింట రెండు వంతల మెజారిటీతో ఆ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంటుంది. ఇంత వ్యవహారం అంత ఈజీ కాదని తెల్సినా అభిశంసన తీర్మానానికి, అందులో రెండోసారి కూడా ప్రయత్నించడమంటే బురద చల్లడం, ఆయన రాజ్యాంగ విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకే అన్న విషయం ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. సమస్యకు తెరపడకుండా సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించడమే. సస్పెండయిన ఓ దళిత జూనియర్ న్యాయమూరి ఓ కేసు విషయంలో తనపై ఒత్తిడి తెచ్చారంటూ, కింది కోర్టు సిబ్బందిని వేధిస్తున్నారంటూ, తనను దూషించారంటూ జస్టిస్ నాగార్జున రెడ్డిపై పెట్టిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ కూడా రెండోసారి అభిశంసన ప్రయత్నం జరగడం విచారకరం. ఈ వివాదానికి సంబంధించి 13- 02-2013లో నాగార్జున రెడ్డిపై ఫిర్యాదు చేశానని, దళిత జడ్జీ మొదట చెప్పడం, ఆ తర్వాత 18–02–2013లో 14–02–2013 తేదీలతో ఫిర్యాదులు చూపడం అంతా కట్టుకథ అని ఎప్పుడో తేలిపోయింది. 95 శాతం ఒళ్లు కాలిన వ్యక్తి నుంచి జస్టిస్ నాగార్జున రెడ్డి మరణ వాంగ్మూల తీసుకున్నట్లు కూడా సదరు జడ్జీ ఆరోపించారు. 95 శాతం కాలిన గాయాలతో ఎవరైనా స్పహలో ఉంటారా? అందుకు డాక్టర్ అంగీకరిస్తారా? జస్టిస్ నాగార్జున రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి తొలిసారి ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని తప్పు తెలసుకొని రాజ్యసభ సభ్యులు గతేడాది డిసెంబర్లోనే వెనక్కి తీసుకున్నప్పుడు మళ్లీ రెండోసారి తీర్మానం ఇచ్చేందుకు ప్రయత్నం ఎందుకు జరిగిందన్నది ఇక్కడ ముఖ్య ప్రశ్న కాదా? కొంతమంది మాయ మాటలు నమ్మి పొరపాటు చేశామని నాడు 61 మంది సంతకాలు చేసిన తీర్మానాలను వెనక్కి తీసుకున్నారు. నాడు జస్టిస్ నాగార్జున రెడ్డికి మద్దతుగా ఆయన రుజువర్తన గురించి తెలియజేస్తూ ఏకంగా 1050 మంది న్యాయవాదులు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు పంపించారు. ఆ తర్వాత జస్టిస్ రామకష్ణ దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గత మార్చి నెలలో హైకోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ మరోసారి అభిశంసనకు ప్రయత్నం జరిగిందంటే ఏమనుకోవాలి? కొందరు విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటపోట్లను తేలిగ్గానే తీసుకోవచ్చు. అసలు పట్టించుకోకపోవచ్చు. న్యాయవ్యవస్థ స్వతంత్రను కోరుకునే జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వారు ఇలాంటి అంశాల పట్ల సున్నితంగా స్పందిస్తారు. ఈ న్యాయవ్యవస్థ స్వతంత్రను పార్లమెంట్ సభ్యుల సంఖ్యకు అప్పగిస్తే బాగుంటుందా? ప్రధాన న్యాయమూర్తి నియమించే జుడీషియల్ కమిటీ న్యాయ వ్యవస్థ స్వతంత్య్రను కాపాడుతుందని ఎవరైనా అనుకోవచ్చు. కానీ నైతిక విలువల పట్ల ఉన్న గౌరవంతోనైనా జస్టిస్ నాగార్జున రెడ్డి లాంటి వాళ్లను విధులకు దూరంగా ఉంచడమంటే ఏమిటీ? ఇలాంటి అంశాల పట్ల అధికారంలో ఉన్న వాళ్లు ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్దం కాదు, వారు ఈ వ్యవస్థలో భాగమయ్యారేమో, ఇలాంటి వ్యవస్థకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదుకదా! -
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునరెడ్డి ఇబ్రహీంపట్నం: అవినీతి నిర్మూలన, పారదర్శకమైన పాలన కొనసాగినప్పుడే అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి అన్నారు. సమాచారహక్కు చట్టంపై ఆదివారం ఇబ్రహీంపట్నంలోని ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత జీవనం కోసం పౌరులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తీవ్రమైన విఘాతాలుగా ఉన్న అవినీతి, బంధుప్రీతిని తరిమివేసేందుకే సమాచార హక్కును చట్టంగా తీసుకురావడం జరిగిందన్నారు. చట్టం చేసి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నా అవినీతి కుంభకోణాలు ఇంకా కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఈ చట్టం అమలు స్ఫూర్తిని దెబ్బతీసేవిధంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన సమాజాభివృద్ధి, అవినీతి రహిత సమాజం కోసం పౌరుల ఆలోచనా సరళిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలు, ధనికులు అన్న వ్యత్యాసం అంతరిస్తేనే సామాజిక న్యాయమనే అర్థం పరిపూర్ణం అవుతుందన్నారు. సమాచారహక్కు చట్టం కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసుకున్నవారికి సదరు అధికారి గడువులోపు సమాచారం అందజేయకుంటే శిక్షార్హులు అవుతారని అన్నారు. వారికి రూ.10 వేలు, ఆపై జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఇదే కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యార్ సంతాపసభను నిర్వహించారు. రాజ్యాంగానికి లోబడి కృష్ణయ్యార్ వెల్లడించిన తీర్పులు సంచలనాలకు మారుపేరుగా నిలిచాయని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగార్జున, భారత న్యాయవాదుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షుడు కేవీ కృష్ణారావు, ప్రధాన కాార్యదర్శి ప్రభాకర్, ఉస్మానియా లా కళాశాల ప్రొఫెసర్ బిబి రెడ్డి, బార్ అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, ఇబ్రహీంపట్నం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, న్యాయవాదులు పి.రాములు, ఉదయశంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.