
వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో విక్రయించేందుకు తీసు కొచ్చిన 5 వేల బస్తాల మొక్క జొన్నలు బుధవారం వర్షపునీటిలో కొట్టుకు పోయాయి. వనపర్తి మార్కెట్‌కు కొద్దిరోజులుగా మొక్కజొన్న విక్రయానికి వస్తోంది. ఈ సీజన్‌లో బుధవారం అత్య ధికంగా విక్రయానికి వచ్చింది. ఉదయం ఎండగా ఉండడంతో రైతులు మొక్క జొన్నను ఆరబెట్టారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు కలసి కొనుగోలు చేసేందుకు టెండర్లు దాఖలు చేసే సమయంలో భారీ వర్షం కురిసింది. రైతులు తేరుకునే సమయానికే మొక్కజొన్న కళ్లముందే వర్షపునీటిలో కొట్టుకుపోవడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు.