
మొక్కజొన్న రైతు గగ్గోలు
ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంటను మరో రైతు భూమి నాదంటూ ట్రాక్టర్‌తో దున్నేశాడు.
రైతుల లబోదిబో..
చిన్నశంకరంపేట : ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంటను మరో రైతు భూమి నాదంటూ ట్రాక్టర్‌తో దున్నేశాడు. వెల్దుర్తి మండలం అచ్చంపేటకు చెందిన చాకలి వెంకయ్య 351 సర్వేనంబర్‌లో మొక్కజొన్న పంట సాగుచేస్తున్నాడు. ప్రభుత్వం గతంలో అసైన్ చేసిన భూమిలో పంటను సాగు చేయగా, ధరిపల్లి గ్రామానికి చెందిన ప్రభురెడ్డి అనే రైతు శుక్రవారం ట్రాక్టర్‌తో పంటను ధ్వంసం చేశాడని బాధిత రైతు వెంకయ్య తెలిపారు.తమకు గతంలో 351|144 సర్వేనంబర్‌లో 2.20 గుంటల భూమిని మంజూరు చేయగా సాగు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామన్నారు.
ఇప్పటికే ఎనిమిదెకరాల అసైన్డ్డ్ భూమిని సాగు చేస్తున్న తనను ప్రభురెడ్డి వేధిస్తున్నాడని ఆరోపించారు. తమపై దౌర్జన్యం చేసీన ప్రభురెడ్డిపై పోలీస్‌లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రభురెడ్డి మాట్లాడుతూ తనకు 8 ఎకరాలు అసైన్డ్ పట్టా ఉందన్నారు. అవసరమైతే న్యాయం కోసం కోర్టుకు వెళ్తానన్నారు