రైతన్నకే మద్దతు | Sakshi
Sakshi News home page

రైతన్నకే మద్దతు

Published Sat, Nov 8 2014 11:40 PM

my support to farmers : sharath

 శరత్: మీరంతా రైతులేనా? కమీషన్ ఏజెంట్లు కూడా ఉన్నారా?
 రైతులు:  అంతా రైతులమే సార్.


 శరత్:  మీ పేర్లు  ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చారు?
 రైతులు: నాపేరు  నర్సింహులు సార్... నా పేరు శేషారెడ్డి.. మాది యార్రారం,  నా పేరు మానయ్య, మా ఊరు కంసానిపల్లి,  నా పేరు జోగిరెడ్డి.. నాది కూడా రాంసానిపల్లి సారు, నా పేరు మాణిక్‌రెడ్డి..కంసానిపల్లి మాజీ సర్పంచ్‌ను సార్....నా పేరు సత్తయ్య, నా పేరు యాదయ్య సార్.

 శరత్: ఎందుకు దిగులు పడుతున్నారు ? మీకున్న సమస్యలేమిటీ?
 నర్సింహులు: సార్, మక్కలు గింతమంచిగున్నయ్( మొక్కజొన్నలు చూపిస్తూ) రేటు మాత్రం ఇస్తలేరు

 శరత్: ఏమైంది...  నిబంధనల ప్రకారం ఇవ్వటం లేదా? తూకంలో మోసం చేస్తున్నారా?
 నర్సింహులు: ఏం పాడైందో.. ఏమో..! సారు, ఏందో గేడింగ్‌లు అంటున్నరు..ఇసువంటి గేడింగులు ఎప్పుడూ లేకుండే.

 శరత్: గ్రేడింగ్ గురించి మీకు తెలియదా?
 రైతులు : గ్రేడింగ్‌లు ఎప్పుడూ లేకుండే సార్( ముక్తకంఠంతో)

 శరత్ : ఏం జోగిరెడ్డి నీకు కూడా తెలియదా?
 జోగిరెడ్డ్డి: తెల్వదు సార్..

 శరత్:  చిన్నసైజు గింజలు ఉన్న మక్కలు  వరూ కొనటం లేదని రైతులు ఫిర్యాదు చేశారు. రైతు
 పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ గ్రేడింగ్ విధానం తెచ్చింది. పెద్ద సైజు గింజలుంటే ‘ఏ’ గ్రేడ్, మధ్యరకం గింజలు ‘బీ’ గ్రేడ్, చిన్న సైజు గింజలు ‘సీ’ గ్రేడ్ గా చేస్తున్నారు.  ‘ఏ’గ్రేడ్‌కు రూ.1,310, ‘బీ’ గ్రేడ్‌కు రూ.1,230, సీ గ్రేడ్‌కు రూ.1,180  మద్దతు ధర చెల్లిస్తోంది. ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి?

 మానయ్య: ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలతోనే పండించాం, కానీ పంట సరిగా పండలేదు సారూ

 శరత్: పంటకు తడి బాగా అందిందా?
 మానయ్య: వానలు ఎక్కడివి సారు, అప్పుడింత..ఇప్పుడింత కురిసిన జల్లుకు ఈ మాత్రం పండింది. విత్తనాలు కూడా మంచియిగానట్టున్నయి సారు.

 శరత్ : మీ పేరేమిటి? ఏదో సమస్యల్లో ఉన్నట్లున్నావు?
 రైతు : నా పేరు మాణిక్‌రెడ్డి సార్, ఇక్కడ హమాలీలకు డబ్బులు మేమే చెల్లించాల్సి వస్తోంది సార్?

 శరత్: కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదా?
 నర్సింహులు: వచ్చేటపుడు డబ్బులు తెచ్చుకోలేం కదా సార్?

 శరత్: ధాన్యంకు సంబంధించి డబ్బులు వచ్చాయా?
 సత్తయ్య: ఈరోజే వచ్చాయి సారు.

 శరత్: ధాన్యాన్ని ఇక్కడకు ఎప్పుడు తెచ్చావు.
 సత్తయ్య: గత నెల 31న కొన్ని, ఈ నెల 2న కొన్ని వడ్లు తెచ్చి కేంద్రంలో కాంటా పెట్టిన. ఇవ్వాళ్ల డబ్బులు వచ్చినాయి.

 శరత్: హమాలీకి ఎంత డబ్బు ఇచ్చావు.
 సత్తయ్య: రూ.600 వరకు ఇచ్చిన.

 శరత్: హమాలీ డబ్బులో సగం భాగం మహిళాగ్రూపు వారు చెల్లించుకోవాలి కదా..!
 అనంతరం జేసీ పక్కనే ఉన్న రైతు బక్కొళ్ల యాదయ్యతో మాట్లాడారు.


 శరత్: ఏం యాదయ్య...ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశావు.
 యాదయ్య: నాలుగు ఎకరాల్లో వేశాను సార్.

 శరత్: ఈ నాలుగు ఎకరాల్లో గత ఏడాది ఎంత దిగుబడి వచ్చింది. ఈ సారి ఎంత వచ్చింది.
 యాదయ్య: గత ఏడాది 70 క్వింటాళ్ల వరకు వచ్చాయి. ఈ సారి 25 క్వింటాళ్లే వచ్చినయి సారు.

Advertisement
 
Advertisement
 
Advertisement