నిజామాబాద్ వ్యవసాయం : ఆరు తడి పంటలు సాగు చేయుడం వల్ల అధిక విస్తీర్ణాన్ని సాగు చేయగలగటమే కాక ఎక్కువ లాభాన్ని కూడా పొందవచ్చు.
రబీ కాలంలో వరికి బదులు గా ఆరుతడి పైర్లు సాగు వల్ల కలిగే ప్రయోజనాలు...
వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుత్ శక్తి, పెట్టుబడులు తక్కువ.
ఒక ఎకరం వరి సాగుకు కావాల్సిన నీటితో కనీసం 2-8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పైర్లను సాగు చేయవచ్చు.
ఆరుతడి పైర్లు వేయడం వల్ల నిత్యావసరాలైన పప్పుదినుసులు, నూనె గింజల కొరత తగ్గుతుంది.
పంట మార్పిడి వల్ల పైర్లను ఆశించే చీడపీడలు, తెగుళ్లు తగ్గుతాయి.
పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల భూసారం వృద్ధి చెందుతుంది.
{పస్తుతం మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం పంటలను వరి కోసిన తర్వాత దుక్కి చేయకుండా ‘‘జీరోటిల్లేజి’’ విధానం ద్వారా విత్తే పద్ధతి వచ్చింది.
వరి కోసిన తర్వాత దుబ్బులు మళ్లీ చిగురించకుండా ఉండేందుకు, అప్పటికే మొలచి ఉన్న కలుపును నివారించేందుకు ‘‘పారాక్వాట్’’ అనే కలుపు నివారణ మందును పిచికారి చేయాలి. లీటరు నీటికి 8 మి.లీ.ల కలుపు మందును(పారాక్వాట్) వరి దుబ్బులు, కలుపు మొక్కలు బాగా తడిసేలా పిచికారి చేయాలి.
పారాక్వాట్ మందు వాడిన తర్వాత వెంటనే విత్తనాలు వేసుకోవచ్చు. భూమిలో సరైన తేమ ఉన్నట్లయితే వెంటనే విత్తుకోవాలి. లేదా పలుచని తడి ఇచ్చి విత్తుకోవాలి. లేదా విత్తే యంత్రాల సహాయంతో విత్తుకోవాలి.
అవసరాన్ని బట్టి కలుపు నివారణ మందులను వాడాలి.
మొక్కజొన్నలో అయితే అట్రజిన్ (లీటరు నీటికి 4-5 గ్రాములు) పొద్దుతిరుగుడు, శనగ, ఆముదం అయితే పెండిమిథాలిన్ (లీటరు నీటికి 5-6 మి.లీ.) కలుపు నివారణ మందులను విత్తిన 1-2 రోజులలోపు పిచికారి చేయాలి.
రబీ కాలంలో వివిధ పంటలకు కావాల్సిన నీటి పరిమాణం, నీరు పెట్టడానికి ఖర్చయ్యే విద్యుత్‌చ్చక్తి యూనిట్లు, ఎకరం వరికి ఇచ్చే నీటితో సాగు చేయగలిగే ఆరుతడి పంటల విస్తీర్ణం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త వివరించారు.
సాగు తీరు మారాలిక
Published Fri, Nov 7 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement