కార్న్‌ఫ్లోర్ హల్వా
రండి.. రండి.. రండి‘పిండి’ వంటలు చేయండి టేస్టీ కార్న్ వంటకాలు తినగ రండి.
కార్న్‌ఫ్లోర్ హల్వా
కావలసినవి: కార్న్ ఫ్లోర్ – కప్పు; పాలు – 3 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – 3 కప్పులు; నిమ్మరసం – టేబుల్ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు (నారింజ రంగు); నెయ్యి – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; తరిగిన డ్రై ఫ్రూట్స్ – తగినన్ని
తయారి: ఒక పెద్ద పాత్రలో కార్న్ ఫ్లోర్, మూడు కప్పుల పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి ∙బాణలిలో రెండు కప్పుల నీళ్లు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి పంచదార కరిగేవరకు కలపాలి ∙నిమ్మరసం జత చేసి పాకం బాగా ఉడుకుపట్టే వరకు కలపాలి ∙పాకం బాగా ఉడుకుతుండగా, కార్న్‌ఫ్లోర్ మిశ్రమం పోస్తూ కలపాలి ∙ఫుడ్ కలర్ జత చేసి మిశ్రమం గట్టిపడే వరకు బాగా కలపాలి ∙కొద్ది కొద్దిగా నెయ్యి జత చేయాలి ∙ఉడుకు పట్టిన తరవాత దింపేయాలి ∙డ్రైఫ్రూట్స్ తరుగు, ఏలకుల పొడి వేసి కలపాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి, హల్వా మిశ్రమాన్ని సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టి పడిన తరవాత చాకుతో ముక్కలుగా కట్ చేసి అందించాలి.
కార్న్ ఫ్లోర్ పాటీస్
కావలసినవి: కార్న్ ఫ్లోర్ – 2 కప్పులు; మైదా పిండి – 4 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; ఉప్పు – టీ స్పూను; గోరు వెచ్చని నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు; అవొకాడో – 1 (తొక్క తీసి, చిన్నచిన్న ముక్కలు చేయాలి)
తయారి: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్, మైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి ∙గోరు వెచ్చని నీరు జత చేసి చపాతీ పిండిలా కలిపి, ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి, గంటసేపు పక్కన ఉంచాలి ∙బాణలిలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న పిండిని వడల మాదిరిగా ఒత్తి నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙చీజ్ తురుము, అవొకాడో ముక్కలను తయారుచేసి ఉంచుకున్న పాటీలపై వేసి వెంటనే అందించాలి.
కార్న్ ఫ్లోర్ చికెన్ కబాబ్
కావలసినవి: చికెన్ (పెద్ద ముక్కలు) – అర కేజీ; మిరప కారం – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; వెనిగర్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; సోయా సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – టేబుల్ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; కార్న్ ఫ్లోర్ – టేబుల్ స్పూను; పెరుగు – టేబుల్ స్పూను.
తయారి: చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు ఒంపేయాలి ∙ఒక పాత్రలో చికెన్ ముక్కలు వేసి, మిగతా పదార్థాలన్నీ జత చేసి బాగా కలిపి మూడు నాలుగు గంటలు పక్కన ఉంచిన తరువాత, ఒక్కో ముక్కను గ్రిల్ మీద కాని అవెన్‌లో కాని వేయించి తీసేయాలి ∙వేడివేడిగా అందించాలి.
కార్న్ ఫ్లోర్ స్పినాచ్ ఆనియన్ పకోరా
కావలసినవి: కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర కప్పులు; సెనగ పిండి – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లి తరుగు – 2 కప్పులు; పుదీనా తరుగు – 2 కప్పులు; అల్లం వెల్లుల్లి ముద్ద – టేబుల్ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – టేబుల్ స్పూను; మిరప కారం – టీ స్పూను; పసుపు – టీ స్పూను; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – తగినంత; కసూరీ మే«థీ – అర టేబుల్ స్పూను; నూనె – అర టేబుల్ స్పూను; కొత్తిమీర – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – తగినన్ని; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారి: ఒక పాత్రలో నూనె తప్పించి, మిగతా పదార్థాలన్నీ వేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙బాణలిలో నూనె కాగాక కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసి వేయించి పేపర్ నాప్‌కిన్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో వేడివేyì పకోడీలు అందించాలి.
కార్న్ ఫ్లోర్ టోర్టిల్లా
కావలసినవి: కార్న్ ఫ్లోర్ – ఒకటిన్నర కప్పులు; గోధుమ పిండి – కప్పు; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు; గోరు వెచ్చని నీళ్లు – ముప్పావు కప్పు; ప్లాస్టిక్ పేపర్లు – 2
తయారి: ఒక పాత్రలో కార్న్‌ఫ్లోర్, గోధుమపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు, నూనె జత చేసి మరోమారు కలపాలి ∙కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, చపాతీపిండి మాదిరిగా కలపాలి. (చేతికి అంటుతున్నట్లుగా ఉంటే, మరికాస్త పిండి జత చేసి కలుపుకోవచ్చు) ∙కలిపి ఉంచుకున్న పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ∙ఒక్కో ఉండను ప్లాస్టిక్ పేపర్ మీద ఉంచి, పైన మరో ప్లాస్టిక్ పేపర్ ఉంచి, చపాతీ కర్రతో ఒత్తాలి ∙స్టౌ మీద పెనం బాగా వేడయ్యాక, ఒత్తి ఉంచుకున్న చపాతీని ప్లాస్టిక్ పేపర్ నుంచి వేరు చేసి పెనం మీద వేసి, రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చాలి.
Comments
Please login to add a commentAdd a comment