
కోళ్ల రైతు కుదేలు
బాన్సువాడ: కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. భారీగా పెరిగిన మేతల ధరలతో కోడిని పెంచాలంటేనే కష్టంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. బాన్సువాడ, ఆర్మూర్, మోర్తాడ్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలతో పాటు, జిల్లాలోని పలు చోట్ల పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
ఏటా పౌల్ట్రీ పరిశ్రమ విస్తరిస్తూనే ఉంది. కాగా. గతేడాది మూడు రూపాయలు ఉన్న గుడ్డు ధర ప్రసు ్తతం నాలుగు రూపాయలకు పెరిగింది. అయినా రైతులకు మాత్రం లాభం చేకూరడం లేదు. గతంలో కంటే ప్రస్తుతం మేత ధరలలో భారీగా వ్యత్యాసం రావడమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. పౌల్ట్రీలో మేతకు ఉపయోగించే సోయా కిలోకు 45 రూపాయలకు పలుకుతోంది.
వేరుశనగ కిలోకు 36 రూపాయలు, పొద్దు తిరుగుడు పిండి 29 రూపాయలు, డీఓబీ పది రూపా యలు ఉంది. మేతలో మొక్కజొన్న, నూకలు, సోయా, ఎండు చేప, మీట్ మిల్, డీఓబీవంటి ధాన్యాలు ఎక్కువగా వాడుతారు. కోళ్లకు అవసరమైన విటమన్ బి కాంప్లె క్స్ వంటివి మేతలోనే కలిపి ఇస్తారు. గుడ్లు పెట్టే కోడి రోజుకు 120 నుంచి 130 గ్రాములు వరకు మేత తింటుంది. కోళ్ల అనారోగ్య స్థితిని బట్టి నీటిలో మందులు వాడతారు.
ప్రభుత్వం సోయా, మొక్కజొన్నవంటి ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతో వీటి కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని రైతులు ఆరోపి స్తున్నారు. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి సోయాతోపాటు మొక్కజొన్న వంటి ధాన్యాలు అందుబాటులోకి రావని అంటున్నారు. పౌల్ట్రీ ఫారంలో వెయ్యి కోళ్ళు ఉంటే ఉం టే 800 గుడ్లు ఉత్పత్తి అవుతాయి. హోల్ సెల్ ధరలో గుడ్డు మూడు రూపాయల చొప్పున రూ. 2,400 ఆదాయం వస్తుంది. మేత కోసం వెయ్యి కోళ్లకు 2,200 వెచ్చిస్తే మిగిలేది రూ. 200 మాత్రమే. గుడ్డు పెట్టే కోళ్ల తయారీకి అవసరమైన పిల్లలను పెంచడానికి అవసరమైన పెట్టుబడిని రైతులు అదనంగా భరించాల్సిన పరిస్థితి ఉంది.
ఐదు వేల మంది కార్మికుల జీవనాధారం
జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమపై సుమారుగా ఐదు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ధరల పెరుగుదలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రస్తుత ధరలను బట్టి కూలీల ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు ఇతరేతర ఖర్చులు అదనంగా భరించే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు బ్యాంకు రుణాలు సైతం భరించా ల్సిందే.
కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితుల్లో మేతలు ఆడడానికి కూలీలకు అదనంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. దీని వల్ల ఇద్దరు కూలీలకు 500 రూపాయలు ఇచ్చే పరస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యుత్తు కోత, మరో పక్క మేత ధరలతో పౌల్ట్రీ రంగం కోటుకోలేని నష్టాలను భరించాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు.