ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే మొక్కజొన్న | Health Cornering Corn | Sakshi

ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే మొక్కజొన్న

Jul 28 2017 11:33 PM | Updated on Sep 5 2017 5:05 PM

ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే మొక్కజొన్న

ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే మొక్కజొన్న

మొక్కజొన్న పొత్తును మనం సరదాగా తింటుంటాం.

గుడ్‌ఫుడ్‌

మొక్కజొన్న పొత్తును మనం సరదాగా తింటుంటాం. కానీ మనకు ఆరోగ్యంతో పొత్తు కుదిర్చే అద్భుతమైన శక్తి దానికి ఉంది. సరదాగా తినేప్పుడు సంతోషం కూడా కలుగుతుంది కదా. అందుకూ ఒక కారణం ఉంది. మొక్కజొన్నలో సంతోషభావనను పెంచే రసాయనాలైన ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నాయి. మొక్కజొన్నలో ఆరోగ్యనికి మేలు చేసే మరిన్ని అంశాలివి...

► మొక్కజొన్నలో బీటా–కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజలను తింటే ఒక రోజులో అవసరమైన విటమిన్‌–ఏ లోని ఆరు శాతం మనకు సమకూరుతుంది. విటమిన్‌–ఏ మన కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే.

► మొక్కజొన్నలో ఫెలురిక్‌ యాసిడ్‌ అనే శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌ ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం దానికి ఉంది. అంతేకాదు... అది వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను అరికడుతుంది. గాయం అయినప్పుడు కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట, నొప్పి)ను తగ్గించే శక్తి కూడా దీనికి ఉంది.

► మొక్కజొన్నలో విటమిన్‌ బి–కాంప్లెక్స్‌లోని థయామిన్, నియాసిన్, పాంటోథెనిక్‌ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్, పైరిడాక్సిన్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలో జరిగే అనేకానేక జీవక్రియల నిర్వహణకు అవి తోడ్పడతాయి.ఇక మన ఆరోగ్యానికి అవసరమైన ప్రధాన ఖనిజాలైన జింక్, మ్యాంగనీస్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్‌ వంటివి కూడా మొక్కజొన్నలో చాలా ఎక్కువ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement