దొమ్మేరు పొత్తులొచ్చాయ్..!
Published Sun, Jul 24 2016 1:57 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
కొవ్వూరు రూరల్ : వాన చినుకులు పడుతున్న వేళ.. వేడివేడి లేత మొక్కజొన్న పొత్తు తింటే.. ఆ రుచే వేరు.. అదీ దొమ్మేరు పరిసరాల్లో పండిన మొక్కజొన్న పొల్తైతే ఇక చెప్పేదేముంది. దొమ్మేరు మొక్కజొన్నకు జిల్లాలో విపరీతమైన డిమాండ్. ప్రస్తుతం సీజన్ కావడంతో పొత్తులు రాక ప్రారంభమయ్యింది. మండలంలోని దొమ్మేరుతో పాటు చుట్టుపక్కల 10 గ్రామల్లో సుమారు 1000 ఎకరాల్లో తినే మొక్కజొన్నను రైతులు పండిస్తారు. జూలై మాసం చివరికి రావడంతో తయారైన పొత్తులను రైతులు విరుపు ప్రారంభించారు. దీంతో దొమ్మేరులోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పొత్తులు అమ్మే దుకాణాలు వెలిశాయి. దుకాణాల్లో ఒక్కో పొత్తు రూ.10 నుంచి రూ.12 వరకూ సైజును బట్టి అమ్ముతున్నారు. అదే హోల్‌సేల్ దుకాణాల్లో 100పొత్తులు(కాల్చనివి) రూ.700 వరకూ అమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా ఎకరా మొక్కజొన్న తోటను రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకూ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వారు పొలం వద్దే పొత్తును విరిచి వ్యాపారులకు 100 పొత్తులు రూ.650 వరకూ అమ్మకాలు సాగిస్తున్నార
Advertisement