dommeru
-
కారు డోర్ లాక్ అయి బాలుడు మృతి
సాక్షి, కొవ్వూరు రూరల్: కారులోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఏడేళ్ల బాలుడు సాయిబాబా ఊపిరి ఆడక మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కళ్లేపల్లి రాధా కుమార్తె లక్ష్మికి దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అనిశెట్టి శ్రీనివాసరావుతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. సాయిబాబా (7), రెండేళ్ల కుమార్తె వైసు ఉన్నారు. శ్రీనివాసరావు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో లక్ష్మి ఇద్దరు పిల్లలతోపాటు దొమ్మేరులో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. సోమవారం సాయిబాబా ఆడుకుంటూ అక్కడ పార్క్ చేసి ఉన్న కారులోకి ఎక్కాడు. డోర్ వేసుకోవడంతో లాక్‌పడింది. కొంతసేపటికి ఊపిరి ఆడక మృతిచెందాడు. సాయంత్రం కారు వద్దకు వచ్చి డోర్ తీసిన యజమాని లోపల బాలుడు మరణించి ఉండటాన్ని గుర్తించారు. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
వైద్య వృత్తికి వెళుతూ విధి వక్రించి..
ఫిజియోథెరపిస్ట్ దుర్మరణం దొమ్మేరులో ఘటన బంధువులు, స్థానికుల ఆందోళన 7 గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్ కొవ్వూరు రూరల్: కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తాడనుకున్న కొడుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన నిమిషాల వ్యవధిలోనే విగతి జీవిగా మారతాడని ఆ కన్నవాళ్లు ఊహించలేదు. అష్టకష్టాలు పడి ఉన్నత చదువులు చదివించుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్దకొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆస్పత్రికి వెళ్లి రోగులకు సేవలు అందించి వస్తానమ్మా అని ఇంటి నుంచి బయలుదేరిన పావు గంటలోనే కానరాని లోకాలకు వెళ్లాడని తెలిసి ఆ తల్లి గుండె చెరువయ్యింది. గుర్తుతెలియని వాహనం మృత్యురూపంలో ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో సొంత ఊరిలోనే ఊపిరిలొదిలాడు కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన ఫిజియోథెరపిస్ట్ తూతా రమేష్ (25). మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతితో గ్రామం శోకసంద్రంగా మునిగిసోయింది. సంఘటనా ప్రాంతంలో మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా ఉన్నాయి.. దొమ్మేరులోని అనంతలక్ష్మి కాలనీలో నివాసముంటున్న వ్యవసాయ కూలి వెంకటరమణ, సీత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు రమేష్‌ను కష్టపడి ఉన్నత చదువులు చదివించారు. గతేడాది ఫిజియోథెరపిస్ట్ కోర్సు పూర్తిచేసుకున్న రమేష్ రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం ఉదయం ఇంటి నుంచి విధి నిర్వహణ నిమిత్తం రాజానగరం వెళుతుండగా దొమ్మేరు ప్రధాన సెంటర్లో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భారీ వాహనాల రాకతో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని, తక్షణమే మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బంధువులు, స్థానికులు మృతదేహం వద్ద టెంట్టు వేసి రాస్తారోకో చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఆందోళన సాగింది. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మృతుడి బంధువులు, ఆందోళనకారులను బలవంతంగా తొలగించి రమేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కొబ్బరి మొవ్వ కోస్తూ కుప్పకూలి..
దొమ్మేరు (కొవ్వూరు రూరల్) : దొమ్మేరు పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ వ్యక్తి కొబ్బరి చెట్ల మొవ్వ కోస్తూ కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సోము రాఘవులు (48) కొబ్బరి పువ్వులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దొమ్మేరు పంచాయతీ స్థలంలో తొలగించిన కొబ్బరి చెట్ల మొవ్వ సేకరించేందుకు వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న రాఘవులు చెట్ల కొబ్బరి మొవ్వ నుంచి పువ్వు సేకరిస్తున్నాడు. రెండు మొవ్వల నుంచి పువ్వును తీసి మూడో చెట్టు వద్దకు చేరుకోగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రాఘవులను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముదునూరి నాగరాజు పోలీసులకు సమాచారమిచ్చి మృతుడి వివరాలను సేకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై గం గాభవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
దొమ్మేరు పొత్తులొచ్చాయ్..!
కొవ్వూరు రూరల్ : వాన చినుకులు పడుతున్న వేళ.. వేడివేడి లేత మొక్కజొన్న పొత్తు తింటే.. ఆ రుచే వేరు.. అదీ దొమ్మేరు పరిసరాల్లో పండిన మొక్కజొన్న పొల్తైతే ఇక చెప్పేదేముంది. దొమ్మేరు మొక్కజొన్నకు జిల్లాలో విపరీతమైన డిమాండ్. ప్రస్తుతం సీజన్ కావడంతో పొత్తులు రాక ప్రారంభమయ్యింది. మండలంలోని దొమ్మేరుతో పాటు చుట్టుపక్కల 10 గ్రామల్లో సుమారు 1000 ఎకరాల్లో తినే మొక్కజొన్నను రైతులు పండిస్తారు. జూలై మాసం చివరికి రావడంతో తయారైన పొత్తులను రైతులు విరుపు ప్రారంభించారు. దీంతో దొమ్మేరులోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న పొత్తులు అమ్మే దుకాణాలు వెలిశాయి. దుకాణాల్లో ఒక్కో పొత్తు రూ.10 నుంచి రూ.12 వరకూ సైజును బట్టి అమ్ముతున్నారు. అదే హోల్‌సేల్ దుకాణాల్లో 100పొత్తులు(కాల్చనివి) రూ.700 వరకూ అమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా ఎకరా మొక్కజొన్న తోటను రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకూ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వారు పొలం వద్దే పొత్తును విరిచి వ్యాపారులకు 100 పొత్తులు రూ.650 వరకూ అమ్మకాలు సాగిస్తున్నార -
సందడి చేసిన ‘సంపూ'
‘హృదయ కాలేయం’ హీరో సంపూర్ణేష్‌బాబు (సంపూ) గురువారం దొమ్మేరులో సందడి చేశారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న బందిపోటు సినిమా షూటింగ్ మూడోరోజు కొనసాగింది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికలకు సంబందించి సన్నివేశాలను అల్లరి నరేష్, పోసాని కృష్ణమురళితో పాటు పలువురు జూనియర్ ఆర్టిస్ట్‌లపై దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ చిత్రీకరించారు. గ్రామ చావిడి వద్ద సంపూర్ణేష్ బాబుపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సహాయ నటుడు చాగల్లు సూరిబాబుతో పాటు పలువురు స్థానిక కళాకారులు నటించారు. శుక్రవారం నుంచి కొవ్వూరులో షూటింగ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాత ఆర్యన్ రాజేష్ తెలిపారు. - దొమ్మేరు (కొవ్వూరు రూరల్) నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు సంపూర్ణేష్‌బాబు దొమ్మేరు (కొవ్వూరు రూరల్): హృదయకాలేయం సినిమాలో తన పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదని సినీహీరో సంపూర్ణేష్‌బాబు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా తమ చిత్రంలో నటించేందుకు ముందుకురాలేదన్నారు. ఈవీవీ బ్యానర్లో పూర్తిస్థాయి నటుడిగా అవకాశం రావడం ఆనందంగా ఉందని సంపూ చెప్పారు. బందిపోటు చిత్రంలో నటించేందుకు కొవ్వూరు మండలం దొమ్మేరు వచ్చిన ఆయనతో ఇంటర్వ్యూ. మీ స్వగ్రామం ఏది మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం మెట్టపల్లి. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అల్లరి నరేష్‌తో నటించడం ఎలా ఉంది. అల్లరి నరేష్‌తో కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. హృదయకాలేయం సినిమాకు మీరే నిర్మాత అని టాక్.. నిజానికి నేనే నిర్మాతగా తీద్దామనుకున్నా. అయితే స్టీవెన్ శంకర్ అనే మిత్రుడు నిర్మాతగా చిత్రాన్ని నిర్మించాం. హృదయకాలేయం నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సినిమా ప్రారంభించడానికి ముందు మూడు నెలల వరకు నాతో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోలేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నా సినిమాలో నటించడానికి ముందుకు రాలేదు. ఎవరూ రాకపోతే మగవారికి ఆడవారి వేషాలు వేసి సినిమా పూర్తిచేద్దామని నిర్ణయించాం. అయితే మా అదృష్టం వల్ల కావ్యకుమారి, ఈషికా సింగ్‌లు హీరోయిన్లుగా నటించేందుకు అంగీకరించారు. ధైర్యంతో కొత్త ప్రయోగం చేశాం. జనం ఆదరించారు. అమెరికా నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సినీపరిశ్రమకు వచ్చారట లేదండీ. నాకు మొదటి నుంచి సినిమాలంటే ఇష్టం. సినీపరిశ్రమలోనే కొనసాగుతున్నాను. తొలిసారిగా మహాత్మా చిత్రంలో డెరైక్టర్ కృష్ణవంశీ చిన్నపాత్ర ద్వారా నటించడానికి అవకాశం ఇచ్చారు. మీ తదుపరి చిత్రం కొబ్బరిమట్ట సినిమాలో హీరోగా నటిస్తున్నా. స్టీవెన్ శంకర్ నిర్మాత. ఆగష్టు 25న ప్రారంభంకానుంది. త్రిపాత్రాభినయం చేస్తున్నా. ఏడుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.