
మంచి పోషకాల మొక్కజొన్న
పిల్లలకు ఏ చిరుతిండి పెట్టాలా అన్నది అమ్మ ఆలోచన. అన్ని కాలాల్లోనూ విరివిగా దొరికే స్వీట్‌కార్న్‌ను రకరకాల రుచులతో పిల్లల టిఫిన్ బాక్స్‌లలో పెట్టడం లేదా వారికి స్నాక్స్‌గా ఇవ్వడం మంచిది. ఎందుకంటే... స్వీట్‌కార్న్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ఇందులో ఉండే మినరల్స్, ఫోలిక్ యాసిడ్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి. స్వీట్‌కార్న్‌లో ఉండే విటమిన్ సి పంటిజబ్బులను దరిచేరనివ్వదు. అలాగే జుట్టు మృదువుగా పెరిగేందుకు దోహదపడుతుంది.
స్వీట్‌కార్న్‌తో పోల్చితే మొక్కజొన్న మరికాస్త చవకైనది. ఇది మంచి సీజనల్ ఫుడ్. ఇందులో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది. మొక్కజొన్నలో ఉండే మెగ్నీషియం, ఐరన్, కాపర్ , కాల్షియం వంటి ధాతువులు పిల్లల్లో కండరాల పెరుగుదలకు, కండరాలు ఫెళుసుబారకుండా ఉండటానికి దోహదపడతాయి. జుట్టుకుదుళ్లు గట్టిగా ఉండేలా చేస్తాయి.