పనీర్ కార్న్ జిలేబీ తయారీకి కావల్సినవి:
పనీర్ తురుము 300 గ్రాములు
పంచదార 1 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా
కార్న్ పౌడర్ పావు కప్పు, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు,
ఏలకుల పొడి పావు టీ స్పూన్, బేకింగ్ సోడా అర టీ స్పూన్, నెయ్యి సరిపడా, నీళ్లు కొన్ని
పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు గార్నిష్‌కి
తయారీ విధానమిలా..
ముందుగా పెద్ద బౌల్‌లో కార్న్ పౌడర్, మైదాపిండి, బేకింగ్ సోడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని, ఉండలు లేకుండా పలచగా కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమంలో పనీర్ తురుము వేసుకుని బాగా కలిపి.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్‌ని ఒక కవర్‌లో వేసుకుని, ఆ కవర్‌ని కోన్‌లా తయారు చేసుకోవాలి. మరుగుతున్న నేతిలో జిలేబీల్లా చుట్టుకుని, దోరగా వేయించుకోవాలి.
ఈ లోపు మరో స్టవ్ మీద పంచదార, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి, సరిపడా నీళ్లు పోసుకుని లేతపాకం పెట్టుకుని.. వేడివేడిగా ఉన్న జిలేబీలను అందులో వేసుకుని పాకం పట్టించాలి. అనంతరం ప్లేట్‌లోకి తీసుకుని, పిస్తా ముక్కలు లేదా జీడిపప్పు ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment