చిల్లీ పనీర్ తయారీకి కావల్సినవి:
పనీర్ – 250 గ్రా (చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్
మైదా పిండి – 5 టేబుల్ స్పూన్లు
క్యాప్సికమ్ – 2 (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయ – 1 (పెద్దగా కట్ చేసుకోవాలి)
ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు, పండు మిర్చి – 4 లేదా 5
అల్లం ముక్కలు – 2 టీ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – 4 (రెండేసి ముక్కలుగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి)
టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు,
ఉప్పు – తగినంత, నూనె – సరిపడా
తయారీ:
ముందుగా బాగా మరిగిన వేడి నీళ్లల్లో పండుమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వేసుకుని 10 నిమిషాలు నానబెట్టి పక్కనే పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లతోనే మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా పేస్ట్‌లా చేసుకోవాలి.
దానిలో పనీర్ ముక్కలు ముంచి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక.. పండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. వెంటనే ఆ మిక్సీ బౌల్‌లో కొద్దిగా నీళ్లు పోసుకుని అటూ ఇటూ కలిపి ఆ వాటర్ కూడా పోసుకోవాలి. అనంతరం గరిటెతో మధ్యమధ్యలో తిప్పుతూ, నూనె వేరుపడేవరకూ ఉడికించి, ఆ మిశ్రమాన్ని బౌల్‌లోకి తీసి పక్కనపెట్టుకోవాలి.
అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని.. పెద్ద మంట మీద ఉల్లిపాయ ముక్కలను లైట్‌గా వేయించాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అదే మంట మీద బాగా ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా ఉడికిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్లో.. పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమంతో పాటు.. తేనె వేసుకుని తిప్పుతూ ఉండాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, సోయా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా తిప్పాలి. తర్వాత మొక్కజొన్న పిండి–పాల మిశ్రమాన్ని వేసుకుని తిప్పాలి. ఇక అదంతా క్రీమ్‌లా మారగానే టొమాటో కెచప్, ఉల్లికాడ ముక్కలు, పనీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment