chilly
-
నోరూరించే చిల్లీ పనీర్.. కెచప్‌తో తింటే అదిరిపోతుంది
చిల్లీ పనీర్ తయారీకి కావల్సినవి: పనీర్ – 250 గ్రా (చిన్న ముక్కలు లేదా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) మొక్కజొన్న పిండి – 4 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి – ముప్పావు టీ స్పూన్ మైదా పిండి – 5 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ – 2 (పెద్దపెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి) ఉల్లిపాయ – 1 (పెద్దగా కట్ చేసుకోవాలి) ఉల్లికాడ ముక్కలు – పావు కప్పు, పండు మిర్చి – 4 లేదా 5 అల్లం ముక్కలు – 2 టీ స్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – 4 (రెండేసి ముక్కలుగా చేసుకోవాలి) పచ్చిమిర్చి – 2 (నిలువుగా కట్ చేసుకోవాలి) టొమాటో కెచప్ – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్, సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె – సరిపడా తయారీ: ముందుగా బాగా మరిగిన వేడి నీళ్లల్లో పండుమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వేసుకుని 10 నిమిషాలు నానబెట్టి పక్కనే పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత ఆ నీళ్లతోనే మిక్సీలో పేస్ట్‌లా చేసుకోవాలి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని.. అందులో మైదాపిండి, 3 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, కొద్దిగా నీళ్లు పోసుకుని చిక్కగా పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో పనీర్ ముక్కలు ముంచి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అనంతరం మరో కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేగాక.. పండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. వెంటనే ఆ మిక్సీ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అటూ ఇటూ కలిపి ఆ వాటర్ కూడా పోసుకోవాలి. అనంతరం గరిటెతో మధ్యమధ్యలో తిప్పుతూ, నూనె వేరుపడేవరకూ ఉడికించి, ఆ మిశ్రమాన్ని బౌల్లోకి తీసి పక్కనపెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకుని.. పెద్ద మంట మీద ఉల్లిపాయ ముక్కలను లైట్‌గా వేయించాలి. తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అదే మంట మీద బాగా ఎక్కువగా కాకుండా ఓ మాదిరిగా ఉడికిన క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కల్లో.. పక్కన పెట్టుకున్న పండుమిర్చి మిశ్రమంతో పాటు.. తేనె వేసుకుని తిప్పుతూ ఉండాలి. నిమిషం తర్వాత నిమ్మరసం, సోయా సాస్, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా తిప్పాలి. తర్వాత మొక్కజొన్న పిండి–పాల మిశ్రమాన్ని వేసుకుని తిప్పాలి. ఇక అదంతా క్రీమ్‌లా మారగానే టొమాటో కెచప్, ఉల్లికాడ ముక్కలు, పనీర్ ముక్కలు వేసుకుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. -
వర్షం తెచ్చిన నష్టం
ఏటూరునాగారం : ఇటీవల కురిసిన వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో మండలంలోని రామన్నగూడెం శివారులో సాగు చేస్తున్న మిరప తోటలు నీట మునిగాయి. బుధవారం ఉదయం నుంచి గోదావరి వరద భారీగా రావడంతో సమీపంలోని మిరప తోటలు నీట మునిగాయి. మొక్కలు నాటిన వారం రోజుల వ్యవధిలోనే తోటలు నాశనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి మిరప విత్తనాలను కొనుగోలు చేసి 35 నుంచి 40 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుని నాటిన మొక్కలు కళ్ల ముందే పాడైపోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. గోదావరి వరదతో రామన్నగూడెంకు చెందిన రాందేని రమేష్ ఎకరం, శ్రీరాం నాగేంద్ర ఎకరన్నర, గారె నర్సింహ ఎకరం, తోట వీరయ్యకు చెందిన ఎకరం తోటలు నీట మునిగి వేర్లు కుల్లిపోయే దశకు చేరుకుంటున్నాయి. గోదావరి తగ్గిందని తోటలు సాగు చేసేందుకు మొక్కలు నాటగా.. ప్రకృతి తమ పాలిట శాపంగా మారిందని వారు బోరున విలపిస్తున్నారు వరద ఉధృతితో ఎకరాకు రూ. 10 వేల నష్టం వాటిల్లిందన్నారు. దుగ్గొండిలో 5,150 హెక్టార్లలో పంట నష్టం దుగ్గొండి : మండలంలోని గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికి వరకు 5,150 హెక్టార్(12875 ఎకరాలు)లలో పంట నష్టపోయినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు వ్యవసాయాధికారి దయాకర్ అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో తుఫాను దెబ్బతిన్న పంటలపై బుధవారం సర్వే ప్రారంభించారు. నష్టపోయిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో తుపానుతో 3,500 హెక్టర్లలో పత్తి, 450 హెక్టార్లలో వరి, 1200 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు నివేదికలు అందించామన్నారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ ఊరటి మహిపాల్‌రెడ్డి, జంగిలి రవి, రాంచంద్రం, తాళ్లపెల్లి వీరస్వామి , వీఆర్ఓ జంగం రాజన్న ఉన్నారు. -
రైతు కంట మిర్చి మంట
మిర్చికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. నెల రోజుల క్రితం ఉన్న ధర కూడా ప్రస్తుతం లేకపోవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల కంట కన్నీరొలుకుతోంది. తమకు అప్పులే మిగులుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరులపాడు : పశ్చిమ కృష్ణాలో ఈ ఏడాది 21 వేల 140 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడం ఒక కారణమైతే పంట చేతికొచ్చే సమయంలో నీటి తడులకు అవసరమైన సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఎన్ఎస్పీ కాలువల్లో చుక్కనీరు కూడా లేకపోవడంతో రైతులు నేలబావుల పైనే ఆధారపడి మిర్చి పంటకు చాలీచాలని తడులను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు మిర్చి పంటలో బొబ్బర తెగుళ్లు అధికంగా ఉండటంతో వాటి నివారణకు రైతులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా నెలరోజుల క్రితం క్వింటా మిర్చి రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలికిందని, ప్రస్తుతం రూ.6 వేల నుంచి రూ.6,500కు పడిపోవడంతో దిక్కుతోచడం లేదని రైతులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజులు గడవకముందే మిర్చి ధర అమాంతం పడిపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం... మిర్చికి ఎకరాకు లక్షా 20 వేల రూపాయల వృరకు ఖర్చులు అయ్యాయృని, పంట దిగుబడి అంతంతగానే ఉండటం, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులే మిగులుతాయని రైతులు వాపోతున్నారృు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వెచ్చించారు. పండించిన పంటను మార్కెట్లోకి తీసుకువస్తే పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయని, గత మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికి తమను ఆదుకోవడంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదనే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు రైతులు అప్పుల బాధ తట్టుకోలేక వచ్చిన ధరకు దళారులకు విక్రయించుకోగా, మరికొందరు మద్దతు ధర కోసం వేచిచూస్తూ కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం మిర్చికి మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలి నేను మూడెకరాల్లో మిర్చి సాగు చేశాను. ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఎన్నో వ్యయప్రయాసలు పడి పంటను పండించి చేతికొచ్చే దశలో ధర ఒక్కసారిగా పడిపోవడంతో అప్పులే మిగిలేలా ఉన్నాయి. ప్రభుత్వం మిర్చికి గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు కొంత ఊరట కలుగుతుంది. - పూర్ణచంద్రరావు, రైతు -
అకాల వర్షం...
పెదకూరపాడు : అకాల వర్షం మిరప, పత్తి రైతులను నష్టాలపాల్జేసింది. పంట చేతికి వస్తున్న సమయంలో వర్షం కురవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండలంలో శుక్రవారం ఉదయం లగడపాడు, కన్నెగండ్ల, హుస్సేన్‌నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం గ్రామాల్లో కురిసిన వర్షానికి పొలం మీద, కల్లాల్లో ఉన్న మిరప కాయలు, చేలల్లో విరగకాసిన పత్తి పూర్తిగా తడిసిపోయాయి. లగడపాడు, హుస్సేన్ నగరం, గారపాడు, బుచ్చియ్యపాలెం, రామా పురంలో మొదటి విడత మిరప కోతలు 10 రోజుల కిందట ప్రారంభమ య్యాయి. కాయలు కోసిన రైతులు కల్లాలకు చేర్చి ఆరబెడుతున్నారు. శుక్ర వారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న పంట పూర్తిగా తడిసి నీళ్లల్లో తేలియాడింది. చేలల్లో పత్తి కూడా పూర్తిగా తడిసిపోయి నేల రాలుతోంది. పత్తి, మిరప పనులకు వెళ్లిన కూలీలు వర్షం కారణంగా వెనుదిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం మిరప పంట పూర్తిగా కాయ, పూత దశలోఉంది. వర్షం పడడంతో చేలల్లోనే నేలరాలాయి. కాయలు తాలుగా మారే ప్రమాదం ఉంది. మిరప, పత్తి పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోతలు కోసిన వరి పంట కూడా తడిసిపోయింది. చేలల్లో పొట్టదశలో ఉన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది. లబోదిబోమంటున్న అన్నదాతలు నకరికల్లు: అకాల వర్షంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఉదయం వర్షం కురిసింది. వరికోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో కురిసిన వర్షంతో పంట నీటిపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చల్లగుండ్ల, నకరికల్లు, నర్సింగపాడు, దేచవరం, చేజర్ల తదితర గ్రామాల్లో వరికోతలు కోసి ఓదెలను ఆరబెడుతున్నారు. ఈ సమయంలో కురిసిన వర్షంతో పల్లపు ప్రాంతాల్లో పంటను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు పరుగులు తీశారు. ఓదెలను కుప్పలుగా వేసి పట్టలు కప్పారు.