
కీళ్లనొప్పులు, కఫానికి మంచి మందు
నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) దీని గురించి ఎపుడైనా విన్నారా? సాధారణంగా ఉడుతలు అవి కొరక్కుండా ఉండేందుకు ఈ నల్లేరు తీగను కూరగాయల పాదులపై పాకిస్తారు. ఈ రోజుల్లో నల్లేరు దాదాపుగా మరచిపోయారు గానీ దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు పచ్చడి తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. కీళ్ల నొప్పులకు చాలా బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఎముకుల పుష్టికి, విరిగిన ఎముకలు అతకడానికి, ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి కీళ్ల సందుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను, వాపును తగ్గించడానికి అట్లు వేసుకుని తింటే దగ్గు కూడా తగ్గుతుంది. మరి నల్లేరు పచ్చడి తయారీ విధానం ఎలాగో చూద్దాం.
ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని ,హిందీలో హడ్జోరా , తెలుగులో నల్లేరు అని పిలుస్తారు. సంస్కృతంలో, దీనిని కవితాత్మకంగా వజ్రంగి, వజ్రవల్లి అని పిలుస్తారు. అంటే వజ్రం అంత బలమైనది అని దీని అర్తం. నల్లేరు తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇందులొ విటమిన్ సీ, నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ.
నల్లేరు పచ్చడి కావాల్సినవి
తరిగిన 10 నల్లేరు కాడలు అర కప్పు వేరుశెనగలు , చింతపండు , నాలుగు ఎండు లేదా పచ్చి మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు 1 టీస్పూన్, కొద్దిగా కొత్తిమీర
పచ్చడి తయారీ తీగ నుంచి నల్లేరు కాడలను కోసేముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఒట్టి చేతులతో తీస్తే దురద వస్తుంది. నల్లేరు లేత కాడలను తీసుకోవాలి. వాటి ఈనెలను తీసి చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకోని, ఉప్పు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఒక బాణలిలో నూన్ వేసి నల్లేరు ముక్కలను వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత, కొద్ది శనగపప్పు, వేరుశనగలు, పచ్చిమిరప లేదా ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక టమాటా వేసి వేయించుకోవాలి. దీన్ని కొత్తగా చింతపండు కలిపి మెత్తగా రోట్లో రుబ్బుకోవాలి. దీన్ని తాజా కరివేపాకు, పోపు గింజలు వేసి పోపు పెట్టుకుంటే కమ్మటి నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. దోస, రోటీలో కూడా నంజుకోవచ్చు.
నల్లేరుతో ఇతర వంటలు
నల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు.
నల్లేరుతో లాభాలు
వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు.
నల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు
నల్లేరులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి.
నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.
రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.
నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారం
నల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?